యాప్నగరం

మహాబలిపురం ఆలయంతో ఏలియన్స్‌కు సంబంధం!

పల్లవ రాజులు నిర్మించిన మహాబలిపురం తీర దేవాలయంలో అనేక రహస్యాలను దాగి ఉన్నాయి. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు దర్శనమిస్తాయి.

TNN 18 Jun 2017, 5:56 pm
Samayam Telugu mahabalipuram temples history and technology
మహాబలిపురం ఆలయంతో ఏలియన్స్‌కు సంబంధం!
పల్లవ రాజులు నిర్మించిన మహాబలిపురం తీర దేవాలయంలో అనేక రహస్యాలను దాగి ఉన్నాయి. 1200 ఏళ్ల చరిత్ర కలిగిన ఆ దేవాలయంలో ఎన్నో వింతలు దర్శనమిస్తాయి. అందులోని శిల్పాలను చూస్తే పురాతనకాలంలోనే రాకెట్ ప్రయోగాలకు నాంది పలికారని అనిపిస్తుంది. మహాబలిపురం చెన్నై‌కు 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పూర్వం దీన్ని మామల్లపురం పేరుతో పిలిచేవారు. క్రీస్తు శకం 7 నుంచి 10వ శతాబ్దం వరకు పల్లవరాజుల కాలంలో ఓడరేవుగా ప్రసిద్ధి చెందింది.

బలిచక్రవర్తి ఈ ప్రాంతాన్ని పాలించడం వల్ల ఈ ప్రాంతానికి మహాబలిపురమనే పేరు వచ్చిందని స్థానికులు అంటారు. రాక్షసుడైన మహాబలిని శ్రీమహావిష్ణువు సంహరించడంతో ఈ పేరు వచ్చిందని స్థల పురాణాలు పేర్కొంటున్నాయి. కాంచీపురాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించిన పల్లవులు స్వదేశీ కళాకారులతో సాగరతీరంలో పెద్ద రాతి కట్టడాన్ని నిర్మించారు. మహాదేవుని ఆలయంతోపాటు పంచ పాండవ రథాలు ఇందులో ఉన్నాయి వీటిలో ప్రధానమైనది కృష్ణుని రాయి. దీన్ని కృష్ణుడి వెన్నముద్దగా పిలుస్తారు. దాదాపు 20అడుగుల పొడవు, వెడల్పు ఎత్తు కలిగిన ఈ రాయి కేవలం రెండు చదరపు గజాల స్థలంలో ఉంటుంది.

250 టన్నుల బరువుండే ఈ రాయిని తొలగించడానికి చాలా మంది ప్రయత్నించి కనీసం అంగుళం కూడా కదిలించలేకపోయారు. 1908 లో ఈ ప్రాంతాన్ని పరిశీలించిన ఆర్ధర్ ఆలీ అనే బ్రిటీష్ అధికారి 7 ఏనుగులను తెప్పించి పెద్ద గొలుసులతో దాన్ని కదిలించడానికి శతవిధాలుగా ప్రయత్నించాడు కానీ కొంచెం కూడా కదపలేక నిరాశతో వెనుదిరిగారు.

ప్రఖ్యాత గాంచిన ఈ శిలను పల్లవరాజు నరసింహవర్మ ఆకాశదేవుని రాయిగా పేర్కొని, దీనిని ఏ శిల్పి ముట్టకూడదని శాసించాడు. కొందరు మాత్రం గుడి కోసం తెచ్చిన ఈ రాయిని మధ్యలోనే వదిలేసారని వాదిస్తారు. ఇంకొందరు ఇది గ్రహాంతవాసులు ఎగిరే పళ్లెం అని అంటారు. దాదాపు 250 టన్నులు బరువు వుండే ఈ రాయిని కొండపైకి తీసుకురావాలంటే ఆ రోజుల్లో సాధ్యమయ్యే పనికాదు, అందుకే ఇది ఎలియన్స్‌కి సంబంధించింది అంటారు. ఈ రాయిని పోలిన రాళ్లు ప్రపంచంలో కొన్ని చోట్ల ఉన్నాయి. అవే ఎలియన్స్ తిరుగుతున్నారనే ఊహాగానాలు వెలువడే మెక్సికో, పెరూలు.

ఈ ప్రదేశంలోని శిల్పాలను చూస్తే టెక్నాలజీకి అబ్బురపకుండా ఉండలేరు. ఒకే చిత్రంలో ఆవు, పాలు తాగుతున్న దూడను చూడవచ్చు. ఆ కాలంలోనే అంతరిక్ష పరిశోధనలకు శ్రీకారం చుట్టారా? అనటానికి అనేక శిల్పాలు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. పల్లవరాజు ఇక్కడ అంతరిక్ష పరిశోధనలు చేసారనడానికి ఆధారాలు కనిపిస్తున్నాయి.ఆ ఆలయంలోని గణేశుడి విగ్రహంపై రాకెట్ లాంచింగ్ వెహికల్ కనిపిస్తుంది. దీంతో పాటు రాకెట్ లాంచ్ చేస్తున్న అనేక రూపాలు కనిపిస్తాయి.

ఇక్కడ విచిత్రమైన మరో అంశం బావి. కొలతలు కూడా అందుబాటులో లేని కాలంలో ఎంతో ఖచ్చితత్వంతో బావిని నిర్మించారు. అప్పట్లోనే సాంకేతిక పరిఙ్ఞానం వాడారు అనడానికి ఇది గొప్ప నిదర్శనం. ఆలయ గోపురంపై ఉండే శూలాన్ని చూస్తే టెక్నాలజీ అబ్బురపరుస్తుంది. శూలానికి సంబంధించిన దేవుడు మనకి ఎక్కడా కనిపించడు. అతని తల మీద రెండు కొమ్ములు,అలాగే హెల్మెట్ ధరించినట్లు ఉంటుంది. అచ్చం శాటిలైట్ స్థంభం మాదిరిగానే ఉంటుంది. ఆ విగ్రహాన్ని చూస్తే రోదసిలోని వ్యోమగాముల్లాగా కనిపిస్తారు.

విమాన గోపురం చుట్టూ వ్యోమగాములను తలపించే ప్రతిమలు కనిపిస్తాయి. ఇక్కడ విచిత్రం ఏంటంటే గర్భగుడిలోకి గాలి చొరబడకుండా నిర్మించారు. ఉపగ్రహ వాహక నౌకలు పంపినపుడు విడుదలయ్యే వాయువులు బయటకు పోయేవిధంగా ద్వారాలను నిర్మించారు. కిటికీలు,తలుపులు కనపడకుండా రాకెట్ లాంచింగ్ సమయంలో వెలువడే రేడియేషన్ తట్టుకునే విధంగా ఈ గుడిని నిర్మించారు. ఇక్కడ లైట్ హౌస్ దాదాపు 1000 ఏళ్ల కిందట నిర్మించారని భావిస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.