యాప్నగరం

పెళ్లి ఆలస్యమవుతుందా? అయితే వీటిని పాటిస్తే....

పురాతన భారతీయ వేదాంతులు వివాహాన్ని పవిత్రమైన బంధంగా పేర్కొన్నారు. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించి, ప్రేమతో లక్ష్యాన్ని చేరుకుని గుర్తింపు రూపంలో విజయాన్ని అందుకుంటారని తెలిపారు.

TNN 19 Mar 2017, 3:37 pm
పురాతన భారతీయ వేదాంతులు వివాహాన్ని పవిత్రమైన బంధంగా పేర్కొన్నారు. పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించి, ప్రేమతో లక్ష్యాన్ని చేరుకుని గుర్తింపు రూపంలో విజయాన్ని అందుకుంటారని తెలిపారు. వివాహ వ్యవస్థలో ప్రతి ఒక్కరూ ఆనందాన్ని కోరుకుంటారు. వయసొచ్చిన పిల్లలకు ఇంకా పెళ్లి కాలేదంటే తల్లిదండ్రులు ఎంతో ఆందోళనకు గురవుతారు.
Samayam Telugu marriage getting delayed these simple vastu tips are your solutions
పెళ్లి ఆలస్యమవుతుందా? అయితే వీటిని పాటిస్తే....


అయితే ఇంట్లో కొన్ని వాస్తుపరమైన దోషాలు కూడా దీనికి కారణమవుతాయని పండితులు పేర్కొంటున్నారు. ఈ దోషాలను నివారించడం వల్ల సులభంగా వివాహం లేదా వైవాహిక జీవితం సంబంధించిన సమస్యల నుంచి బయటపడొచ్చట.


పెళ్లీడుకొచ్చిన అమ్మాయిల గది ఇంటికి ఎల్లప్పుడూ వాయవ్య దిశలోనే ఉండాలి. ఒకవేళ ఈ దిశలో లేకపోతే పశ్చిమ దిశ కూడా మంచిదే. ఎట్టి పరిస్థితుల్లోనూ అమ్మాయిలు గది ఇంటికి నైరుతి భాగంలోనే ఉండాలి. ఎందుకంటే నైరుతి మూల స్థిరత్వం ఉంటుంది. వివాహం కావాల్సిన వారికి మాత్రం నైరుతి దిశ అనుకూలం.

ఒకవేళ అబ్బాయిలకు మున్ముందు వివాహం చేయాలనుకుంటే వారి గది దక్షిణం లేదా పశ్చిమ దిక్కులో ఉండాలి.

కుమార్తె పెళ్లి విషయంలో అబ్బాయి తరఫు నుంచి సమస్యలు ఎదుర్కొంటున్నారా అయితే మీ ఇంట్లో నుంచి బయటకు వెళ్లే గుమ్మానికి ఎదురుగా కూర్చోవద్దు. ఇలా చేస్తే సమస్యలకు పరిష్కారం దొరకుతుంది.

కుటుంబంలో యుక్త వయసుకొచ్చిన కూతురు వివాహం చేసుకోడానికి సముఖంగా లేకపోతే గాజు ప్లేటులో క్రిస్టల్ బాల్స్ వేసి ఆమె గదిలోని ఉత్తర దిక్కును ఉంచండి.

కుజ దోషం వల్ల పెళ్లిలో జాప్యం జరుతుంటే వారికి ఉండే గది తలుపులకు ఎరుపు లేదా గులాబీ రంగు వేయండి. దీని వల్ల కుజ దోషం ప్రభావం తగ్గుతుంది.

పెళ్లి ప్రయత్నాలు విఫలమైన అమ్మాయి లేదా అబ్బాయిలు ఉండే గది గోడలకు పింక్, లేత పసుపు లేదా తెలుపు రంగులను ఉపయోగించాలి. దీని వల్ల వివాహ అడ్డంకులు తొలగిపోతాయి.

వివాహానికి సిద్ధంగా ఉన్న యువతీ యువకులు తమ మంచం కింద ఇనుప వస్తువులు ఉంచకూడదట. అలాగే నిరుపయోగమైన వస్తువులను కూడా పడుకునే మంచానికి దూరంగా ఉంచాలట.

నైరుతి దిశలో తక్కువ, తేలికపాటి ఎత్తు ఉంటే వివాహంలో జాప్యానికి కారణం అవుతుంది. అంతే కాకుండా ఈ దిక్కులో భూగర్భ నీటి ట్యాంకులు ఉన్నా ఇంట్లోని పిల్లలకు త్వరగా పెళ్లి జరగదట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.