యాప్నగరం

ఘనంగా శ్రీవారి పార్వేట ఉత్సవం

సమస్తలోక రక్షణ కోసం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి పార్వేట ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించింది.

TNN 3 Jul 2017, 9:17 am
సమస్తలోక రక్షణ కోసం తిరుమల శ్రీవేంకటేశ్వరుడి పార్వేట ఉత్సవాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం వైఖానస ఆగమోక్తంగా నిర్వహించింది. శనివారం సుప్రభాత సేవలో స్వామి వారిని మేల్కొలిపి నిత్యకట్ల కైంకర్య పూజలను ఆగమోక్తంగా జరిపారు. శ్రీనివాసుడు శ్రీమహావిష్ణువు అవతారంలో శంఖు, చక్రం, గద, ఖడ్గం, అంకుశం, విల్లు చేపట్టి పార్వేట (వేటాడటం) ఉత్సవంలో పాల్గొ్న్నాడు. బంగారు తిరుచ్చి వాహనాన్ని అధిరోహించి శ్రీనివాస మంగాపురంలో ఊరేగాడు.
Samayam Telugu mcok hunting festival observed in srinivasa mangapuram tirupati
ఘనంగా శ్రీవారి పార్వేట ఉత్సవం


ఆలయానికి 5 కి.మీ. దూరంలో శ్రీవారి మెట్టు మార్గంలో ఏర్పాటుచేసిన పార్వేట మండపంలో స్వామి వారికి నివేదన, గద్యపూజ నిర్వహించారు. అనంతరం పంచాయుధాలను చేతబూనిన శ్రీవారు వెంటరాగా, ఆయన అనుమతితో ఆలయ అర్చకులు బాలాజీరంగకుమార్ స్వామి అంకుశం చేపట్టారు. మూడుసార్లు వన్యమృగాలను వేటాడే ఘట్టాలు నిర్వహించారు. అనంతరం మరోసారి మండపానికి వేంచేసిన స్వామివారికి నైవేద్యం సమర్పించి ఆస్థాన పూజల చేశారు. ఈ వేడుకలో తితిదే జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోలా భాస్కర్ పాల్గొన్నారు.

అనంతరం ఈ ఉత్సవం గురించి తితిదే జేఈవో విలేకరులతో మాట్లాడారు. శ్రీనివాస మంగాపురం ఆలయ నిర్వాహకులు పార్వేట ఉత్సవాన్ని 2015లో ప్రారంభించారని చెప్పారు. కార్తీక మాసంలో కార్తీక వనభోజనాలను కూడా నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈవో అనికుమార్ సింఘాల్‌తో దీనిపై చర్చించి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.