యాప్నగరం

మగవారికి ఎక్కడ పుట్టుమచ్చలుంటే అదృష్టమో తెలుసా?

శరీరంలోని వివిధ భాగాల్లో ఉండే పుట్టుమచ్చలు వ్యక్తుల భవిష్యత్తును తెలుపుతాయట. అంతేకాదు వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయవచ్చట.

TNN 18 Feb 2017, 12:37 pm
శరీరంలోని వివిధ భాగాల్లో ఉండే పుట్టుమచ్చలు వ్యక్తుల భవిష్యత్తును తెలుపుతాయట. అంతేకాదు వాళ్ల వ్యక్తిత్వాన్ని కూడా అంచనా వేయవచ్చట. దీనిపై పురాతన హిందూ పురణాల్లో పేర్కొన్నట్లు ఆధ్యాత్మిక వేత్తలు తెలియజేస్తున్నారు. హస్తసాముద్రిక శాస్త్రం ప్రకారం పురుషులకు ఈ కింది భాగాల్లో పుట్టుమచ్చలు ఉంటే ఎలా ఉంటుందో తెలియజేస్తున్నారు.
Samayam Telugu moles on the mens body says something as per samudrikasastra
మగవారికి ఎక్కడ పుట్టుమచ్చలుంటే అదృష్టమో తెలుసా?


విశాలమైన నుదురు ఉంటే ఆ వ్యక్తి మంచి ఆలోచనా పరుడే కాదు కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తాదట. అలాంటి నుదుటి భాగంలో పుట్టుమచ్చ ఉన్నవాళ్లు సమాజంలో మంచివారుగానూ, పరోపకారిగానూ ఉంటారట.

సరిగ్గా రెండు కనుబొమల మధ్య పుట్టుమచ్చ ఉంటే ఆ వ్యక్తి దీర్ఘాయువుతో జీవిస్తాడు. సకల భోగాలపై ఆసక్తి ఉంటుందట. సువాసన పట్ల ఆసక్తిని కలిగి స్త్రీలను విశేషంగా ఆకర్షించగలరట.

కుడి కను బొమపై పుట్టుమచ్చ ఉంటే త్వరంగా వివాహం అవుతుందట. అలాగే గుణవంతురాలైన భార్య లభిస్తుందట. భార్య వల్ల గొప్ప అదృష్టవంతుడవుతాడట. వీరికి శాంత స్వభావం కూడా ఎక్కువేనట. కుడి కంటిలో ఉంటే స్థిరాస్తులను కూడబెట్టుకుంటారట.

కుడి కనురెప్పపై పుట్టుమచ్చ ఉండే వ్యక్తులు అపార సంపదలతో కోట్లకు పడగలెత్తుతారట. వాహన యోగం కూడా లభిస్తుందట.

ముఖానికి కుడి వైపున పుట్టుమచ్చలు ఉండే వాళ్లు అదృష్టవంతులవుతారట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.