యాప్నగరం

సంతాన భాగ్యం లేనివాళ్లు ఇలా చేస్తే....

ప్రళయం తర్వాత బ్రహ్మ పున:సృష్టి చేస్తాడని బ్రహ్మపురాణంలో పేర్కొన్నారు. ఆ రోజు నుంచి కాలచక్రంలోని సత్య యుగం ప్రారంభమవుతుంది.

TNN 29 Mar 2017, 11:21 am
ప్రళయం తర్వాత బ్రహ్మ పున:సృష్టి చేస్తాడని బ్రహ్మపురాణంలో పేర్కొన్నారు. ఆ రోజు నుంచి కాలచక్రంలోని సత్య యుగం ప్రారంభమవుతుంది. కాలచక్రం ప్రారంభమైన ఆ రోజే ఉగాది. పవిత్రమైన ఉగాది రోజు ఏదైనా మంచి పని ఆరంభిస్తే ఆశించిన ఫలితం వస్తుందని పురాణాల్లోనూ, చరిత్రల్లో కొన్ని సంఘటనలు ఉదాహరణగా ఉన్నాయి.ఈ రోజు ప్రత్యేకంగా బ్రహ్మను పూజిస్తారు. ఆయన కోసం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బ్రహ్మధ్వజాన్ని ఎగురువేస్తారు. మరాఠీలు జరుపుకునే గుడిపాడ్వాకు అర్థం ఇదే. గుడి అంటే పతాకం, పాడ్వా అనేది సంస్కృత‌ పదానికి అర్థం చంద్రమానం ప్రకారం వచ్చే తొలి అమావాస్య తర్వాతి రోజు.
Samayam Telugu navaratri celebration started from ugadi festival
సంతాన భాగ్యం లేనివాళ్లు ఇలా చేస్తే....



పద్నాలుగేళ్ల అరణ్యవాసం అనంతరం ఆయోధ్యకు చేరుకున్న శ్రీరాముడికి పట్టాభిషేకం జరిపిస్తారు. పట్టాభిషేకం సందర్భంగా బ్రహ్మధ్వజాన్ని ఆవిష్కరించారని పండితులు అంటున్నారు.

మహర్షి దయానంద సరస్వతి ఈ రోజునే ఆర్య సమాజాన్ని తొలిసారిగా ప్రారంభించాడని మరో కథనం ప్రచారంలో ఉంది. మరాఠాలు యుద్ధంలో విజయం సాధించి వచ్చిన రోజు కూడా ఇదే.

ఉజ్జయిని రాజు విక్రమాదిత్యుడు శాలివాహన శకాన్ని ప్రారంభించినట్లు చారిత్రక కథనం కూడా ప్రచారంలో ఉంది. శాలివాహన శకం ప్రారంభమై నేటికి 1939 ఏళ్లు పూర్తయింది. దీని ప్రకారమే హిందువులు పండుగలు, సంప్రదాయాలు, జ్యోతిషశ్శాస్త్రం నిర్ణయించారు.

హేవళంబి నామ సంవత్సరానికి అధిపతి కుజుడు. కాబట్టి శివపార్వతులను పూజించి, రామాయణాన్ని నవమి వరకు పారాయణం చేస్తే ఈ ఏడాదంతా అదృష్టం వరిస్తుంది. ప్రత్యేకంగా సుందరకాండను ప్రతి రోజు సాయంత్రం చదవడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.

నవరాత్రుల్లో మూడో రోజు తేనే దానం చేస్తే పూర్వీకుల ఆత్మశాంతి, ఆరో రోజున సంతానం లేని దంపతులు చెరకు రసాన్ని దానం చేస్తే సంతాన భాగ్యం కలగుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.