యాప్నగరం

Navratri 2022 Day 3 చంద్రఘంట మాత ఎవరు.. తన ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి...

Navratri 2022 Day 3 పురాణాల ప్రకారం చంద్రఘంట మాతను పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారు. ధైర్యానికి, నిర్భయతకు చంద్రఘంట మాతను ప్రతీకగా భావిస్తారు. ఈ అమ్మవారిని చంద్రఖండ, చండిక లేదా రాంచండి అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా చంద్రఘంట మాత ఎవరు? తనకు ఆ పేరేలా వచ్చింది..

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 28 Sep 2022, 12:27 pm
Navratri 2022 Day 3 దేవీ శరన్నవరాత్రుల్లో భాగంగా సెప్టెంబర్ 28వ తేదీ బుధవారం నాడు మూడో రోజు చంద్రఘంట మాతను ఆరాధిస్తారు. పురాణాల ప్రకారం చంద్రఘంట మాతను పార్వతీదేవి వివాహ రూపంగా భావిస్తారు. ధైర్యానికి, నిర్భయతకు చంద్రఘంట మాతను ప్రతీకగా భావిస్తారు. ఈ అమ్మవారిని చంద్రఖండ, చండిక లేదా రాంచండి అని కూడా పిలుస్తారు. ఈ సందర్భంగా చంద్రఘంట మాత ఎవరు? తనకు ఆ పేరేలా వచ్చింది.. చంద్రఘంట ప్రాముఖ్యతలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu navratri 2022 day 3 who is maa chandraghanta know all about significance mantra colour bhog in telugu
Navratri 2022 Day 3 చంద్రఘంట మాత ఎవరు.. తన ప్రాముఖ్యతలేంటో తెలుసుకోండి...


​చంద్రఘంట మాత ఎవరంటే..

పురాణాల ప్రకారం, పార్వతీదేవిని మనువాడేందుకు పరమేశ్వరుడు హిమవాన్ రాజభవనానికి చేరుకున్నప్పుడు, తన తల్లి మైనా దేవి అతని అసాధారణ అవతారాన్ని చూసి మూర్చపోయింది. ఎందుకంటే తన మెడలో సర్పం ఉంది. తన కురులన్నీ చిందరవందగా ఉన్నాయి. పరమేశ్వరుని వివాహ ఊరేగింపులో దయ్యాలు, బుుషులు, రాక్షసులు ఉన్నారు. ఆ సమయంలో ఈశ్వరుడిని ప్రసన్నం చేసుకోవడానికి పార్వతీదేవి చంద్రఘంట రూపాన్ని ధరించింది. అప్పుడు శివుడు అందమైన యువరాజుగా కనిపించాడు. ఆ తర్వాత వారి వివాహం జరిగింది.

Navratri 2022 దుర్గా దేవిని ఈ పువ్వులతో పూజిస్తే.. ఏ పనిలో అయినా సులభంగా సక్సెస్ సాధించొచ్చు...

​చంద్రఘంట ప్రాముఖ్యత..

మహా గౌరి తన నుదుటిపై అర్ధచంద్రుని ఆకారాన్ని ధరించడం ప్రారంభించినప్పుడు అమ్మవారిని చంద్రఘంట అని పిలుస్తారు. తను ధైర్యసాహసాలకు ప్రాతినిధ్యం వహించే సింహాన్ని అధిరోహించింది. ఈ మాతకు పది చేతులు ఉంటాయి. ఒక చేతిలో కమలం పువ్వు.. మరో చేతిలో కమండలం, ఖడ్గం, త్రిశూలం, విల్లు, గద, బాణం, జపమాల ఉంటాయి.

​శత్రు నాశనం..

ఈ రూపంలో చంద్రఘంట అమ్మవారు సకల అస్త్రశస్త్రాలతో యుద్ధానికి సిద్ధమైంది. రాక్షాసులను మట్టుబెట్టి భక్తులకు రక్షణగా నిలిచింది. ఈ అమ్మవారు తన భక్తులకు ఏవైనా దుష్టశక్తులు వెంటాడుతుంటే వాటిని తరిమికొడుతుందని పురాణాల్లో పేర్కొనబడింది. అందుకే ఈ అమ్మవారిని శత్రువులను నాశనం చేసే మాతగా పేర్కొంటారు.

​చంద్రఘంట మంత్రాలు..

‘‘ఓం దేవి చంద్ర ఘంటాయై నమః’’

‘‘పిండజ ప్రవరారూఢ చండకోపాస్త్రకైర్యుతా’’

‘‘ప్రసాదం తనుతే మహ్యం చన్ర్డఘణ్టేతి విశ్రుతా’’

‘‘యా దేవీ సర్వభూతేషు మా చంద్రఘంటా రూపేణా సంస్థితా

సంస్థితా నమస్తేస్య నమస్తే స్య నమస్తే నమో నమః’’

ఈ మంత్రాలను పఠిస్తూ చంద్రఘంట అమ్మవారిని ఆరాధించడం వల్ల మన జీవితంలోని కష్టాలన్నీ తొలగిపోయి, మనం సుఖశాంతులతో ఉండేలా అమ్మవారు అనుగ్రహిస్తారు. అంతేకాదు మన మేధస్సు, తెలివితేటలు కూడా పెరుగుతాయని పండితులు చెబుతారు.

​సుఖశాంతుల కోసం..

ఈ దేవత శుక్ర గ్రహాన్ని కూడా పరిపాలిస్తుంది. ప్రతి ఒక్కరి జీవితంలో సుఖశాంతులు నెలకొనేందుకు సహాయపడుతుంది. ఈ అమ్మవారిని పూజించడం వల్ల పాపాలు, బాధలు, ప్రతికూల శక్తుల బాధ తొలగిపోతుందని చాలా మంది నమ్ముతారు. ఈ పవిత్రమైన రోజున రాయల్ బ్లూ కలర్లో ఉండే డ్రస్సును వేసుకోవాలి. దీని ప్రకాశవంతమైన నీడ మీ గొప్పతనాన్ని, ప్రశాంతతను సూచిస్తుంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.


రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.