యాప్నగరం

వీటిని నైవేద్యంగా పెడితే అప్పులు తీరిపోతాయట

రోజూ దేవుడి పూజ చేసి, పండ్లు, పలహారాలు నైవేద్యంగా సమర్పిస్తారు. తమ ఇష్టదైవానికి పూలతోనూ, పాలతోనూ అభిషేకాలు చేస్తారు. అయితే దేవతలకు ఒక్కో పండు ఒక్కో విధమైన సంతృప్తి కలిగిస్తుంది.

TNN 5 Jul 2017, 6:23 pm
రోజూ దేవుడి పూజ చేసి, పండ్లు, పలహారాలు నైవేద్యంగా సమర్పిస్తారు. తమ ఇష్టదైవానికి పూలతోనూ, పాలతోనూ అభిషేకాలు చేస్తారు. అయితే దేవతలకు ఒక్కో పండు ఒక్కో విధమైన సంతృప్తి కలిగిస్తుంది. అంతేకాదు ఒక్కో పండుతో ఒక్కో రకమైన కోరికలు సిద్ధిస్తాయి. మనసులోని కోరికలు నెరవేరాలంటే దైవానికి ఇష్టమైన వాటిని సమర్పించాలి. వాటిలో ముఖ్యమైనవి ఫలాలు. ఈ కింది ఫలాలను ఇష్టదైవానికి ఇలా సమర్పిస్తే కోరికలు తప్పక నెరవేరతాయి.
Samayam Telugu offers these fruits for gods and gives which wish
వీటిని నైవేద్యంగా పెడితే అప్పులు తీరిపోతాయట


అరటి పండును దేవుడికి నైవేద్యంగా పెడితే ఇష్టార్థసిద్ధి కలుగుతుంది.

చిన్న అరటి (యాలక్కి అరటి) నైవేద్యంగా సమర్పిస్తే అర్థాంతరంగా నిలిచిపోయిన పనులు ముందుకు సాగుతాయి. అంతే కాదు పనులు త్వరగా పూర్తవుతాయి.

అరటి పండును గుజ్జుగా చేసి నైవేద్యం పెడితే అప్పుల బాధ తొలగిపోతుంది. మొండి బాకీలు వసూలు కావడమే కాదు, నష్టపోయిన నగదు పొందే అవకాశం ఉంటుందట. రాదనుకున్న నగదు తిరిగి రావడం, ఒకవేళ ప్రభుత్వానికి పన్ను రూపంలో ఎక్కువ చెల్లించినా తిరిగి వస్తుంది. శుభకార్యాలకు అవసరమైన నగదు సకాలంలో చేతికి అందుతుంది.

పూర్ణఫలం లేదా టెంకాయను నైవేద్యంగా సమర్పిస్తే పనులు త్వరగా, సులభంగా పూర్తవుతాయి. చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా నెరవేరుతాయి, పై అధికారుల నుంచి ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కావు.

పెళ్లిచూపులకు వచ్చిన అబ్బాయి తరఫు వారు అంగీకారం తెలపడానికి ఆలస్యం చేసినా లేదా చేసుకోడానికి నిరాకరించినా సపోటా పండు దేవుడికి నైవేద్యంగా సమర్పిస్తే ఆటంకాలు తొలగిపోతాయి.

పనులు చేసి పెడతామని మాట ఇచ్చిన తర్వాత వేర్వేరు కారణాలతో మధ్యలో ఆపేస్తే కమలాపండును నైవేద్యంగా ఉంచితే నమ్మకమైన వ్యక్తుల ద్వారా పనులు పూర్తవుతాయని విశ్వాసం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.