యాప్నగరం

ఓనమ్ వచ్చింది.. సంబరం తెచ్చింది

కేరళలో జరుపుకునే అతి పెద్ద పండుగ ఓనమ్. ఈ పండుగ గతంలో నెల రోజుల పాటు జరిగేది. ఇప్పుడు పది రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేరళలో అంతటా ఈ పండుగ వాతావరణం నెలకొంది.

TNN 14 Sep 2016, 1:26 am
కేరళలో జరుపుకునే అతి పెద్ద పండుగ ఓనమ్. ఈ పండుగ గతంలో నెల రోజుల పాటు జరిగేది. ఇప్పుడు పది రోజుల పాటు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం కేరళలో అంతటా ఈ పండుగ వాతావరణం నెలకొంది. అథమ్‌తో తొలి రోజు వేడుకలు ప్రారంభమై
Samayam Telugu onam festival flower decorated designs at kerala guruvayoor temple for past 5 days
ఓనమ్ వచ్చింది.. సంబరం తెచ్చింది

చిత్తిర, చోతి, విశాగం, అనిళ, థ్రికెత్త, మూలం, పూరాడం, ఉత్రాడం అంటూ చివరిగా తిరుఓనమ్ తో ఈ సంబరాలు ముగుస్తాయి. పండుగ మొత్తంలో తిరుఓనమ్‌కు ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఈ రోజున మలయాళీలు నిర్వహించే ఓనసద్యా అనే విందు చాలా ముఖ్యమైనది. ఇందులో తప్పకుండా పాల్గొనాలనే ఆచారం వారికి ఉంది. మలయాళీయులకు ప్రీతిపాత్రమైన రెండు పండుగల్లో ఒకటి కొత్త సంవత్సరాదిగా పిలుచుకునే విషు, రెండోది శ్రవణోత్సవంగా పిలవబడే తిరుఓనమ్. పంట కోతకు వచ్చి ఇంటి సిరుల పంట వచ్చే తరుణంలో ఓనమ్‌ వస్తుంది. ఈ ఉత్సవాలకు కేరళ ప్రభుత్వం ఈ సారి నాలుగు రోజులు సెలవు కూడా ప్రకటించింది.

వామనావతారంలో పాతాళంలోకి బలిచక్రవర్తిని నెట్టిన విష్ణుమూర్తి, బలిచక్రవర్తి కోరిక మేరకు ఏడాదికి ఓ సారి తన ప్రజలను చూసేందుకు వచ్చేలా వరమిచ్చాడు. దీంతో ప్రతి ఏడాది బలిచక్రవర్తి తమ ఇళ్లకు వచ్చి ప్రజల సంతోషాన్ని చూస్తాడన్నది కేరళీయుల నమ్మకం. ఆ రోజునే ఓనమ్ పండుగను వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగ సందర్భంగా కేరళలో ఎక్కడ చూసినా ఏనుగుల స్వారీలు, అందమైన తెల్లచీరలతో మగువలు ఇలా అంతా కోలాహలంగా నెలకొంది. కాగా కేరళలోని గురువాయర్‌ ఆలయంలో గత ఐదు రోజులుగా రంగురంగుల రంగవల్లులతో రకరకాల పూలతో అంత్యంత సుందరంగా చేసిన అలంకరణలు ఆకట్టుకున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.