యాప్నగరం

వాహనం లేకుండా ఆకాశయానం చేయగల శక్తి వీరి సొంతం

పురాణాల ప్రకారం రుషులను నాలుగు రకాలుగా విభజించారు. వారు దేవర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు, రాజర్షులు. ఉత్తమ శ్రేణికి చెందిన రుషులను బ్రహ్మర్షులు అంటారు.

Samayam Telugu 30 Jun 2018, 6:29 pm
పురాణాల ప్రకారం రుషులను నాలుగు రకాలుగా విభజించారు. వారు దేవర్షులు, బ్రహ్మర్షులు, మహర్షులు, రాజర్షులు. ఉత్తమ శ్రేణికి చెందిన రుషులను బ్రహ్మర్షులు అంటారు. సామాన్య రుషి స్థాయిని దాటిని గొప్పవారి మహర్షి, రాజుగా ఉంటూనే రుషిత్వం పొందినవాడు రాజర్షి. దేవలోకంలో ప్రతిష్ఠి కలవారు దేవర్షులు. వీరిలో నారదుడు, పర్వతముని గొప్పవారు.
Samayam Telugu నారదుడు, పర్వత ముని


పర్వతముని : ప్రాచీన ఋషులలో ఒకరైన పర్వతముని ఎల్లప్పుడూ నారద మహర్షితో కలిసి ఉంటాడు. వాహనాలు అవసరం లేకుండానే ఆకాశయానం చేయగల శక్తి వీరి సొంతం. దేవతల దృష్ఠిలో నారదుని లాగానే పర్వత మునికి కూడా దేవర్షిగా గుర్తింపు పొందారు. జనమేజయుడు సర్పయాగాన్ని ఆచరించిన సమయంలో నారదునితో పాటు పర్వత ముని కూడా హాజరయ్యాడు. భగవంతుని లీలలను మధురంగా గానం చేస్తూ లోకాలను పర్యటించడం వల్ల వీరు గంధర్వులుగానూ గుర్తించబడ్డారు. అలా పర్యటిస్తున్న సమయంలోనే ద్రౌపదీ స్వయంవరాన్ని ఆకాశం నుంచి వీక్షించారు. నారద మహర్షి లాగానే పర్వత ముని కూడా ఇంద్ర సభను, కుబేరుడి ఆస్థానాన్ని సందర్శించేవాడు. సృంజయ మహారాజు కుమార్తె వల్ల ఒకసారి చిక్కుల్లోపడ్డారు. పర్వత ముని అనుగ్రహం వల్ల సృంజయ మహారాజుకు పుత్ర సంతానం కలిగింది.

నారదుడు: పురాణాలలో నారదుడి పాత్ర అనన్య సామాన్యమైంది. భాగవత పురాణంలో నారదుని చరిత్ర సంపూర్ణంగా వివరించారు. గత జన్మలో దాసీపుత్రుడైన నారదుడు, సాధు పుంగవులు, మహాత్ముల సాంగత్యంతో భక్తి మార్గాన్ని అనుసరించి తరువాతి జన్మలో తనకు సాటి ఎవరూలేని నారదుడిగా అవతరించాడు. భారతం, భాగవతం, రామాయణం లాంటి మహా పురాణాలలో మాత్రమే కాదు భక్తికి సంబంధించిన వేదసారస్వతంలో నారదముని ప్రసక్తి తప్పనిసరిగా ఉందనడంలో అతిశయోక్తి ఏ మాత్రమూ లేదు. దేవర్షులుగా గుర్తింపు పొందిన వారిలో నారదముని ప్రముఖుడు. బ్రహ్మ మానస పుత్రుడు మాత్రమే కాదు ఆయనకు శిష్యుడు కూడా. బ్రహ్మ సంప్రదాయ పరంపరలో మొట్టమొదటి వాడిగా భక్తి విశిష్టతను జగత్తుకు ప్రచారం చేశాడు. ధృవుడు, ప్రహ్లాదుడు, వాల్మీకి లాంటి ప్రఖ్యాతి చెందిన భక్తులకు నారదుడే మంత్రోపదేశం చేసి భక్తి మార్గానికి దారి చూపించాడు. వేదాలను రచించిన వ్యాస మహర్షికి కూడా ఆయన ఆధ్యాత్మిక గురువు. వేద వ్యాసుని ద్వారా దీక్షను స్వీకరించిన మధ్వాచార్యుని నుంచి ప్రారంభమైన మధ్వ సంప్రదాయం, గౌడీయ సంప్రదాయంతో కలిసి ప్రపంచం ఆద్యంతం ప్రచారం చేయబడింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.