యాప్నగరం

గర్భంలోని శిశువు భగవంతుడిని ఇలా ప్రార్థిస్తాడు!

జీవుడు శేష దు:ఖంతోనే గర్భంలో ప్రవేశిస్తాడు. ఫలదీకరణం తర్వాత శిశువు పరిణామక్రమం ఇలా ఉంటుంది. ఒక రోజుకు ఖలిలమౌతాడు. ఐదు రోజులకు బుడగ ఆకారం పొందుతాడు.

TNN 14 Jul 2017, 6:29 pm
జీవుడు శేష దు:ఖంతోనే గర్భంలో ప్రవేశిస్తాడు. ఫలదీకరణం తర్వాత శిశువు పరిణామక్రమం ఇలా ఉంటుంది. ఒక రోజుకు ఖలిలమౌతాడు. ఐదు రోజులకు బుడగ ఆకారం పొందుతాడు. పది రోజులకు రేగు పండులా కఠినమైన మాంసపు ముద్దగా తయారవుతాడు. నెల రోజులకు తల ఏర్పడుతుంది. రెండు నెలలకు చేతులు, ఇతర అవయవాలు, మూడో నెలకు గోళ్లు, రోమాలు, చర్మం, లింగం, నవరంధ్రాలు ఏర్పడతాయి. నాలుగో నెలకు సప్త ధాతువులు ఉద్భవిస్తాయి. ఐదో నెలకు ఆకలి దప్పికలు, ఆరో నెలలకు జరాయువు ఏర్పడి, మావిచేకప్పబడిన శిశువు గర్భంలో దక్షిణాన తిరుగుతుంటాడు. తల్లి తీసుకునే ఆహార, పానీయాలతో క్రమక్రమంగా వృద్ది చెందుతూ, దుర్గంధ భూయిష్టమైన మలమూత్రాల గుంటలోని పురుగులు, సుకుమారమైన శరీరాన్ని కుడుతుంటే ఆ బాధకు తట్టుకోలేక మాటిమాటికి మూర్చబోతాడు.
Samayam Telugu prayer of the unborn child to god and mother
గర్భంలోని శిశువు భగవంతుడిని ఇలా ప్రార్థిస్తాడు!


నరకయాతన, నరకానుభవం అనేవి జీవుడు మాతృ గర్భంలోనే అనుభవించడం ప్రారంభమవుతుంది. ఆహారం ద్వారా తల్లి తీసుకునే లవణాది పదార్థాలతో సర్వాంగాలలో నొప్పి కలుగుతుంది. మావి, పేగులతో చుట్టుకున్న శిశువు వక్రీభూతమై పృష్ఠశిరోధరుడై తల్ల కిందులుగా ఉంటాడు.
పంజరంలో పక్షిలాగా గర్భంలో జీవి బంధీగా ఉంటాడు. ఆ సమయంలో భగవంతుని దయతో పూర్వ జన్మలో చేసిన పాపాలు గుర్తుకొస్తాయి. గత జన్మలో చేసిన పాప పుణ్యాల వల్లే ఈ జన్మ వచ్చిందని బాధపడతాడు. కర్మ ఫలితం అనుభవించక తప్పదని పరితపిస్తూ బంధభూతాలైన సప్తధాతువులు కలిగి, భగవంతునిపై కృతజ్ఞతతో గద్గద స్వరంతో ప్రార్థించడం గర్భంలోనే ప్రారంభమవుతుంది.

గత జన్మల పాపపుణ్యాల సంఘటితమే ఈ మానవ జన్మ అని తలచుకుంటూ భగవంతుడికి మాతృ గర్భంలో ప్రమాణం చేస్తాడు. ఓ శ్రీహరీ... నీ మాయతో భార్య, బిడ్డలు, అహంకారం, మమకారం, కామం ఉచ్చులో పడి, సంసార సాగరంలో నిమగ్నమై, మంచి, చెడులను విడచాను. ధర్మాధర్మాల విచక్షణ మరిచి ధన సంపాదనే ధ్యేయంగా, చేయకూడని, చెప్పుకోలేని పాపాలకు కారకుడనయ్యాను. అలా సంపాదించిన ధనం, భాగ్యాలను నా భార్యాబిడ్డలు అనుభవిస్తున్నారే కానీ తనను పట్టించుకోవడం లేదు. నేను సంపాదించిన ఆస్తులు బిడ్డలు అనుభవిస్తే, పాపాలు మాత్రం నేను మూటగట్టుకున్నాను.

ఓ భగవంతుడా ఈ దుర్గంధంతో గర్భంలో ఇక ఉండలేను. దయచేసి నన్ను బయటపడేస్తే ఈ సారి పాపకృత్యాలకు దూరంగా ఉంటాను. మీ చరణారవిందాలను ఎప్పుడూ వీడను. ఈ సారైనా ముక్తి పొందడానికి ప్రయత్నిస్తాను. ఈ జన్మలో నాకు సంసార బంధాన్ని కట్టబెట్టవద్దు. పొరపాటున కూడా సంసారం జోలికి పోను. పరాత్పరా... ఈ మలమూత్ర కూపంలోని దుర్గంధాన్ని భరిచలేక, జఠరాగ్ని రూపంలోని వేడి వల్ల మాడిపోతున్నాను. నన్ను బయటకు పంపు. నిన్ను మరచిపోనని జీవుడు ప్రార్థిస్తాడు. మరి మాతృ గర్భంలో భగవంతుడికి ఇచ్చిన మాటను మనం నిలబెట్టుకుంటున్నామా?.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.