యాప్నగరం

కార్తీక సోమవారం రోజు శివుడికి వీటిని సమర్పిస్తే...

కార్తీకం శివకేశవులకు అత్యంత ప్రీతకరమైన మాసం. కార్తీకంలో వచ్చే సోమవారం శివుడికి ప్రత్యేక అభిషేకాలు జరిపిస్తారు.

TNN 5 Nov 2017, 5:53 pm
కార్తీకం శివకేశవులకు అత్యంత ప్రీతకరమైన మాసం. కార్తీకంలో వచ్చే సోమవారం శివుడికి ప్రత్యేక అభిషేకాలు జరిపిస్తారు. సోమవారం నాడు శివారాధన చేస్తే మనసులోని కోరికలు నెరవేరుతాయని భావిస్తారు. అలాంటింది అత్యంత పవిత్రమైన కార్తీక సోమవారం రోజు శివుడిని భక్తితో పూజిస్తే సకల పాపాలు తొలగిపోతాయని హిందువుల నమ్మకం. అయితే చాలా మంది పాలు, జలాలతోనే శివలింగానికి అభిషేకం చేస్తారు. అయితే ఈ కింది విధంగా చేస్తే ఈశ్వరానుగ్రహం లభించి, జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు తొలగిపోతాయి.
Samayam Telugu praying to lord shiva by offering these things on a shivlinga will be fruitful for you
కార్తీక సోమవారం రోజు శివుడికి వీటిని సమర్పిస్తే...


చెరుకు రసంతో శివుడికి అభిషేకం చేస్తే ఆర్థికపరమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

శివలింగంపై అత్తరు పూస్తే చాలా ప్రయోజనాలు లభిస్తాయి. జీవితంలో సంతోషంతోపాటు విజయం చేకూరుతుంది.

లింగానికి తేనేతో అభిషేకం చేస్తే శివుడు ప్రసన్నమవుతాడు. దీని వల్ల ఆరోగ్యం కలిగి, దీర్ఘాయుష్షు కలుగుతుంది.

శివలింగానికి నెయ్యి పూస్తే సంతానానికి ప్రయోజనం ఉంటుంది. వారు ఆరోగ్యవంతులుగానూ, తెలివైనవారు గానూ ఉంటారు.

ఆవనూనెతో అభిషేకం చేస్తే ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. వేదాల్లోనూ ఈ విషయం గురించి చర్చించారు.

పాలు, గంగా జలంతో శివలింగాన్ని పూజించిన వారికి మనసు నిర్మలంగా ఉంటుంది. ఒత్తిడి దూరమవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.