యాప్నగరం

శబరిమలలో మహిళలకు ప్రవేశం.. హిందూ సంఘాల ఆందోళన

బరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెను దుమారమే రేగుతోంది.

Samayam Telugu 30 Jul 2018, 1:04 pm
శబరిమల అయ్యప్ప ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పించాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై పెను దుమారమే రేగుతోంది. మహిళలకు ప్రవేశాన్ని కల్పిస్తూ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేయడంతో హిందూ సంఘాలు భగ్గుమంటున్నాయి. విజయన్ తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ శ్రీరామసే, హనుమాన్ సేన, అయ్యప్ప ధర్మసేనలు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టాయి. ఈ సందర్భంగా అయ్యప్ప ధర్మసేన ప్రతినిధులు మాట్లాడుతూ.. శతాబ్దాలుగా అనుసరిస్తోన్న సంప్రదాయాన్ని నిర్వీర్యం చేయడానికి చేసే ప్రయత్నాలను ప్రభుత్వం విరమించుకోవాలని పేర్కొన్నారు. హిందూ సంఘాలు హర్తాళ్లతో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ప్రభుత్వం పటిష్టమైన బందోబస్తు ఏర్పాటుచేసింది. మరోవైపు ఆర్‌ఎస్ఎస్ మాత్రం ఈ ఆందోళనకు దూరంగా ఉంటామని ప్రకటించింది.
Samayam Telugu శబరిమల ఆలయం


ఆలయానికి సంబంధించిన సున్నితమైన విషయాన్ని వీధుల్లోకి లాగడం తమకు ఇష్టం లేదని ఆర్ఎస్‌ఎస్ కేరళ ప్రతినిధి గోపాలన్ కుట్టి వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ వివాదం గురించి విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అన్ని వర్గాల ప్రజల అభిప్రాయాలను సేకరిస్తోందని, దీనిపై తుది నిర్ణయం తర్వాత ఇంకా వెలువడలేదని అన్నారు. ఏటా నవంబరు నుంచి జనవరి వరకు శబరిమల అయ్యప్ప ఆలయంలో జరిగే మండల, మకరజ్యోతి పూజలో లక్షలాదిగా భక్తులు స్వామి దర్శనానికి వస్తారు. ఈ సంఖ్య ఏడాదికేడాది పెరుగుతూనే ఉంది. అత్యంత కఠోర నియమ నిష్టలను పాటించి శ్రద్ధాశక్తులతో దీక్షలు చేసి స్వామి వారిని దర్శించుకోవడం ఆనవాయితీ. అయితే 10 నుంచి 50 సంవత్సరాల లోపు మహిళలకు ఆలయంలో ప్రవేశం నిషేధం.

దీనిపై కేరళకు చెందిన యంగ్ లాయర్స్ అసోసియేషన్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గతేడాది దాఖలు చేసిన పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన సుప్రీంకోర్టు కేసు రాజ్యాంగ ధర్మాసనానికి అప్పగించింది. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యులతో కూడిన ధర్మాసనం పూర్తి స్థాయి విచారణ చేపట్టింది. ఆలయాలు ప్రైవేట్ ఆస్తులు కాదని, మహిళలను ఆలయంలోకి రాకుండా అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమంటూ తీర్పు వెల్లడించింది. మతాచారాలు, సంప్రదాయాలన్నీ రాజ్యాంగానికి లోబడే ఉండాలని ధర్మాసనం స్పష్టం చేసింది. మహిళలపై నిషేధం మతాచారాల్లో కీలకమైందని ఆలయ నిర్వాహకులు నిరూపించుకోవాల్సి ఉందని కూడా పేర్కొంది. దీంతో స్పందించిన కేరళ సర్కార్ శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.