యాప్నగరం

రామమందిరం కోసం రామనామ జపయజ్ఞం!

అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలన్నది 100 కోట్ల మంది భారతీయుల కలని, దాన్ని నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు.

TNN 5 Dec 2022, 1:23 pm
అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించాలన్నది 100 కోట్ల మంది భారతీయుల కలని, దాన్ని నెరవేర్చేందుకు తమ వంతు ప్రయత్నాలు చేస్తామని పరిపూర్ణానంద స్వామి పేర్కొన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ, మందిరం నిర్మాణానికి భగవంతుడి సహకారం కోరుతూ వంద కోట్ల రామనామ జపాన్ని ప్రారంభించనున్నట్టు తెలిపారు. సుప్రీంకోర్టులో అయోధ్య వివాదంపై కేసు విచారణ దశలో ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ, తాము న్యాయస్థానాలను నమ్ముతున్నామని, ఇదే సమయంలో ప్రజలకు మంచి సందేశాన్ని ఇస్తూ, భగవంతుని కృప కోసం తమ వంతు ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. గురువారం ప్రారంభమయ్యే వంద కోట్ల రామనామ జపయజ్ఞం 15వ తేదీ వరకూ నిర్విఘ్నంగా సాగుతుందని పరిపూర్ణానంద అన్నారు.
Samayam Telugu Ram mandir


రామనామాన్ని కూడా సోషల్ మీడియా ద్వారా అందరికీ పంపిస్తుంటామని తెలిపారు. అయోధ్యలో రామమందిర నిర్మాణానికి అన్ని అనుమతులూ లభించాయని, కోర్టు కూడా సానుకూలంగానే స్పందించిందని వ్యాఖ్యానించారు. ముస్లిం సంఘాలు కూడా హిందువుల మనోభావాలను గౌరవిస్తున్నాయని పరిపూర్ణనంద గుర్తు చేశారు. తాము చేపట్టిన మహాయజ్ఞంలో నాలుగు వేదాలకూ హవనం, ఆంజనేయస్వామి ఆరాధన, హనుమద్ ఉపాసన, చండీ, సుదర్శన ఉపాసన, రామయజ్ఞం, అన్నదానం ఉంటాయని, ఉత్తర భారతావనికి చెందిన సాధు సంతువులు పాల్గొంటారని వెల్లడించారు. ప్రవాస భారతీయులు సైతం భాగం కానున్నారని పేర్కొన్నారు. తమకు రాముడు, ఆంజనేయుడే నేతలని స్వామి తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.