యాప్నగరం

Tulsi Leaves ఈ దేవుళ్లకు పొరపాటున కూడా తులసి ఆకులను సమర్పించకూడదు.. ఒకవేళ నైవేద్యంగా పెడితే కష్టాలు తప్పవు...

Tulsi Leaves Not Offered to These Gods సాధారణంగా మనం దేవుడి పూజ చేసే సమయంలో పండ్లు, పువ్వులు, తులసి ఆకులతో పాటు నైవేద్యంగా తీపి పదార్థాలతో ఇంకా కొన్ని రకాల వస్తువులను సమర్పిస్తూ ఉంటాం. అయితే శాస్త్రాల ప్రకారం తులసి ఆకులను కొందరు దేవతలకు ఎట్టి పరిస్థితులకు సమర్పించకూడదు. పొరపాటున ఈ దేవుళ్ల దగ్గర తులసిని సమర్పిస్తే సంతోషం కంటే బాధలే పెరుగుతాయని పండితులు చెబుతున్నారు.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 6 Jan 2023, 6:57 pm
Tulsi Leaves Not Offered to These Gods హిందూ మత విశ్వాసాల ప్రకారం, తులసి మొక్క ఎంతో పవిత్రమైనది. తులసి చెట్టులో లక్ష్మీదేవి నివసిస్తుందని చాలా మంది నమ్ముతారు. అందుకే శ్రీ మహా విష్ణువు నుంచి ఆంజనేయుడిని వరకు తులసి ఆకులను విధిగా సమర్పిస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల తమ కష్టాలన్నీ తొలగిపోయి సంతోషంగా ఉంటామని చాలా మంది నమ్ముతారు. అయితే అందరూ దేవుళ్లకు తులసి ఆకులను సమర్పించకూడదని శాస్త్రాల ద్వారా తెలుస్తోంది. పురాణాల్లో కొందరు దేవతలకు తులసి ఆకులను నిషేధించారు. పొరపాటున ఆ దేవుళ్లకు తులసిని సమర్పిస్తే వారి కోపానికి బలి కావాల్సి వస్తుందని పెద్దలు చెబుతారు. అంతేకాదు మీ వ్యక్తిగత జీవితంతో పాటు కుటుంబ జీవితంలో లేనిపోని కష్టాలు, నష్టాలొస్తాయని నమ్ముతారు. ఈ సందర్భంగా ఏయే దేవుళ్లకు తులసి ఆకులను సమర్పించకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Tulsi Vivah 2022


హిందూ మత గ్రంథాల ప్రకారం, ప్రతి దేవుడికి, దేవతకు కొన్ని ఇష్టమైన వస్తువులు ఉంటాయి. వాటిని ఆ దేవుళ్లకు సమర్పించడం ద్వారా ఆ భగవంతుని అనుగ్రహం లభించి, కష్టాలన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. శాస్త్రాల ప్రకారం, శ్రీ క్రిష్ణుడికి, శ్రీహరికి చాలా తులసి అంటే చాలా ప్రీతికరమైనది. అయితే వినాయకుడిని, పరమేశ్వరుడిని పూజించేటప్పుడు తులసి ఆకులను సమర్పించొద్దు. పొరపాటున మీరు తులసి ఆకులను సమర్పిస్తే మీరు వారి కోపానికి గురి కావాల్సి వస్తుంది. అంతేకాదు మీ జీవితంలో అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

Sabarimala Temple అయ్యప్ప స్వామి సన్నిధికి చేరడానికి ముందే వావర్ మసీదును దర్శించుకోవడానికి గల కారణాలేంటో తెలుసా...
తులసిని సమర్పించకపోవడానికి కారణాలు..
పురాణాల ప్రకారం, ఓ రోజు వినాయకుడు గంగా నది ఒడ్డున తపస్సు చేస్తున్నప్పుడు ధర్మాత్మజ్ఞా కుమార్తె తన పట్ల ఆకర్షణకు గురైంది. తనను వివాహం చేసుకోవాలని వినాయకుడి తపస్సుకు భంగం కలిగించింది. ఇది విన్న వినాయకుడు తన వివాహ ప్రతిపాదనను తిరస్కరించాడు. దీంతో తులసి దేవి ఆగ్రహించి వినాయకుడిని రెండు పెళ్లిళ్లు చేసుకోమని శాపం విధిస్తుంది. అందుకే గణేవుడు రిద్ధి, సిద్ధి అనే ఇద్దరు మహిళలను వివాహం చేసుకున్నాడు.

అందుకే అప్పటి నుంచి వినాయకుడి పూజలో తులసిని సమర్పించడాన్ని అశుభంగా పరిగణిస్తారు. అయితే శ్రీ క్రిష్ణుడికి, శ్రీ మహా విష్ణువుకు, హనుమంతుడికి తులసిని సమర్పించొచ్చు. తులసితో పూజలు కూడా చేయొచ్చు. కానీ పరమేశ్వరుడికి, వినాయకుడిని పూజించేటప్పుడు మాత్రం తులసిని ఉపయోగించొద్దు.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.