యాప్నగరం

షిర్డీ ఆలయ గోడపై సాయి రూపం.. భారీగా తరలివచ్చిన భక్తులు

షిర్డీలోని ద్వారకామయి ఆలయంలోని ఓ గోడపై సాయిబాబా రూపం దర్శనమిచ్చినట్టు ఓ భక్తుడు చెప్పడంతో ఈ వార్త దావానంలా వ్యాపించింది.

Samayam Telugu 14 Jul 2018, 9:42 am
షిర్డీలోని ద్వారకామయి ఆలయంలోని ఓ గోడపై సాయిబాబా రూపం దర్శనమిచ్చినట్టు ఓ భక్తుడు చెప్పడంతో ఈ వార్త దావానంలా వ్యాపించింది. బుధవారం అర్థరాత్రి నుంచి బాబా రూపం కనిపించిందనే సమాచారంతో ఈ ఆకృతిని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివచ్చారు. రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 3 వరకు దాదాపు నాలుగు గంటలపాటు సాయిరూపం గోడపై కనిపించినట్టు స్థానికులు చెబుతున్నారు. దీంతో భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. వారిని అదుపుచేయడానికి భద్రతా సిబ్బంది తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. సాక్షాత్తు షిర్డీ సాయి నిజరూప దర్శనం తమకు కలిగిందని భక్తులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. సాయిని ప్రత్యక్ష రూపంలో దర్శించకునే అదృష్టం దక్కిందని తెగ సంతోషపడిపోతున్నారు. అయితే దీనిపై షిర్డీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ మాత్రం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. మరికొద్ది రోజుల్లో సాయిబాబా సమాధిలోకి వెళ్లి 100 ఏళ్లు పూర్తికాబోతున్న సమయంలో ఇలా దర్శనం ఇవ్వడం ఆయన మహిమలకు నిదర్శనం.
Samayam Telugu సాయిబాబా రూపం



రాముడు, అల్లా ఒక్కరేనని, ఇరువురి బోధనల సారాంశం ఒక్కటేనని, అందరి దైవం ఒక్కరే కాబట్టి మతాల పేరుతో కలహించుకోవడం మాని సోదరుల్లా కలిసి మెలిసి జీవించాలని సాయి బోధించారు. అంతేకాదు సర్వాంతర్యామి అయిన ఆ భగవంతుని సేవించడానికి మత భేదం ఆటంకం కారాదాని అందరి దైవం ఒక్కరే. మతం అనేది ఆ దైవాన్ని చేరుకునే ఒక మార్గం మాత్రమేనని ఉద్భోధించారు సాయి. అందుకే సాయిని కులమతాలకు అతీతంగా పూజిస్తారు. 18 ఏళ్ల ప్రాయంలో షిర్డీకి వచ్చిన సాయి తన మహిమలతో దైవత్వాన్ని చాటిచెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.