యాప్నగరం

గణపతిని ఈ రూపంలో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి!

విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయి, వాటిలో 16 మాత్రం అత్యంత ముఖమైనవి.

TNN 14 Mar 2018, 4:23 pm
సిద్ధిగణపతిని ఆరాధించడం వల్ల అష్టైశ్వర్యాలు, అష్టసిద్దులూ కలుగుతాయి. అసలు సిద్ధిగణపతి ఎవరు? ఆయనను పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుందా? అనే సందేహాలకు సమాధానం ఇది. విఘ్నాధిపతి అయిన వినాయకుడిని 16 రూపాల్లో తాంత్రికులు పూజిస్తుంటారు. నిజానికి వినాయకుడికి 32 రూపాలున్నాయి, వాటిలో 16 మాత్రం అత్యంత ముఖమైనవి. వీటిలో సిద్ధి గణపతి రూపం ఒకటి. దీనినే పింగళ గణపతి అంటారు. ఈ రూపం పరిపూర్ణత్వానికి సంకేతం. బంగారు వర్ణంలో శోభాయమానంగా ఉండే సిద్ధి గణపతిని సేవిస్తే ప్రారంభించిన పనులలో అపజయం ఉండదు. ఈ వినాయకుడి రూపానికి నాలుగు చేతులుంటాయి. కుడి చేతిలో మామిడి పండు, పరశువు ఉంటాయి. ఎడమ చేతిలో పూలగుత్తి, చెరుకుగడలు ధరించి, తొండంతో నువ్వుల కుడుములు పట్టుకుని దర్శనమిస్తారు.
Samayam Telugu siddi ganapathi puja for wonderful way of wealth
గణపతిని ఈ రూపంలో పూజిస్తే ఐశ్వర్య ప్రాప్తి!


సిద్ధి గణపతికి అష్ట సిద్ధులను ప్రసాదించే శక్తి ఉంది. ఈ గణపతి ఆరాధనతో తలపెట్టిన కార్యాలను నిర్వఘ్నంగా పూర్తిచేసే శక్తి లభిస్తుంది. రోజూ సిద్ధి గణపతిని ధ్యానించడం వల్ల మన ఆలోచనలకు అనుగుణంగా పరిస్థితుల్లో మంచి మార్పులు వస్తాయి. మనం చేయలేమనే నిరాశతో వదిలేసిన అనేక కార్యక్రమాలను విజయవంతంగా పూర్తిచేసే మనో ధైర్యం లభిస్తుంది. ‘పక్వచుత ఫల పుష్పమంజరీ ఇక్షుదండ తిలమోదకై స్సహ ఉద్వాహన్ పరశుమస్తు తే నమః శ్రీ సమృద్ధియుత హేమం పింగళ’ అనే మంత్రంతో ధ్యానించాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.