యాప్నగరం

నరకంలో శిక్షల నుంచి తప్పించుకోవాలంటే..

హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మనుషులు చనిపోతే వారివారి పాపపుణ్యాల ఫలితంగా స్వర్గానికి లేదా నరకానికి చేరుకుంటారని అంటారు.

TNN 31 Jan 2017, 3:27 pm
హిందూ ధర్మ శాస్త్రం ప్రకారం మనుషులు చనిపోతే వారివారి పాపపుణ్యాల ఫలితంగా స్వర్గానికి లేదా నరకానికి చేరుకుంటారని అంటారు. తాము చేసిన పాపాల వల్ల ఖచ్చితంగా నరకానికే పోతామని కొందరు అంటారు. అలాగే సలసలా కాగే నూనెలో వేయిస్తారని, కొరడాలతో హింసిస్తారని ఏదోదో చెబుతారు. అయితే నరకానికి చేరుకోకుండా ఉండాలంటే కొన్నింటిని తప్పనిసరిగా పాటించాలని పురాణాలు పేర్కొంటున్నాయి.
Samayam Telugu sins according to garuda purana and punishments
నరకంలో శిక్షల నుంచి తప్పించుకోవాలంటే..


కలియుగ వైకుంఠం తిరుమలలోని పుష్కరిణిలో ఎవరైతే స్వామివారితోపాటు పుష్కరిణి కీర్తిస్తూ భక్తితో స్నానమాచరిస్తారో వారికి తామిశ్రం, మహారౌరవం, కుంభీపాకం, కాలసూత్రం, అసిపత్రతవనం లాంటి ఇరవై ఎనిమిది భయంకరమైన శిక్షలు తొలగుతాయట. ఊహాలకు అందని, వర్ణించలేని మహాపాపాలు చేయడం వల్ల నరకంలో ఈ భయంకర శిక్షలకు గురవుతారట.

మహాపాపాలన్నీ స్వామివారి పుష్కరిణిలో ఒక్క స్నానంతో నశిస్తాయట. కాబట్టి పవిత్రమైన ఈ పుష్కరిణిని భక్తితో కీర్తిస్తూ స్నానం ఆచరించాలి. పావనమైన ఆ జలాల్లో అత్యంత భక్తి ప్రపత్తులతో స్నానమాచరించి, సేవించాలి. అత్యంత పుణ్యప్రదమైన స్వామివారి పుష్కరిణిని ఏ మాత్రం కించపరచకూడదు. ఆ పుష్కరిణి మహత్మ్యాంపై ఏ మాత్రం సందేహం ఉండకూడదు.

అలాగే భక్తి విశ్వాసాలతో ఉన్న వారికి కుశంకలు కలిగించరాదట. భక్తుల విశ్వాలను దెబ్బతీసేలా వ్యాఖ్యానించివాళ్లు నికృష్టమైన జన్మను పొంది వ్యర్థ జన్ములై మహానరకానికి పోతారట. నాస్తికుల వల్ల కలిగే భయాలను స్వామివారి పుష్కరిణి స్నానం పోగొడుతుందట. ఆ తీర్థ జలాలలో స్నానమాచరించివారు, వాటిని సేవించినవారు, పుష్కరిణి స్తుతించిన వారు, తాకినవారు లేదా నమస్కరించిన వారికి పునర్జన్మ ఉందట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.