యాప్నగరం

ఈ ఆలయంలో పూజలు చేస్తే కోర్కెలు తప్పక...!

పురాణాలు, వేదాలకు భారతదేశం పుట్టిల్లు. అనేక సంప్రదాయాలకు, ఆచారాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భిన్నసంస్కృతులు భారత్ సొంతం.

TNN 29 May 2017, 5:36 pm
పురాణాలు, వేదాలకు భారతదేశం పుట్టిల్లు. అనేక సంప్రదాయాలకు, ఆచారాలకు నిలయం. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా భిన్నసంస్కృతులు భారత్ సొంతం. ఇక ఆలయాలకు చెప్పక్కర్లేదు. ముఖ్యంగా తమిళనాడులోని దేవాలయాలకు ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. వాటిలో ఒకటి చెన్నైలోని కాళికాదేవి ఆలయం. తమిళనాడు రాజధాని చెన్నై తంబుచెట్టి వీధిలోని ప్యారిస్ కార్నర్ ప్రాంతంలో కొలువున్న కాళికాదేవి శివపరమాత్మ కమఠేశ్వరునిగా పూజలందుకుంటున్నారు. క్రీ.శ 1677 అక్టోబరు 3 న ఈ దేవాలయంలోని అమ్మవారిని ఛత్రపతి శివాజీ దర్శించి పూజలు చేసిన తర్వాతే పలు యుద్ధాల్లో విజయం సాధించాడు.
Samayam Telugu super powerful temple of kalikambal in chennai
ఈ ఆలయంలో పూజలు చేస్తే కోర్కెలు తప్పక...!


కొన్ని శతాబ్దాల కిందట ఈ ఆలయం సముద్ర తీరాన ఉండేది. అయితే 1640లో దీన్ని ఈ ప్రాంతానికి తరలించారు. మళ్లీ 1678లో శివాజీ ఈ దేవాలయాన్ని పునరుద్దరించాడు. దేవాలయంలోని అమ్మవారిని శాంత స్వరూపానికి ప్రతీకగా పేర్కొంటారు. తమిళులు కామాక్షిగా కొలుస్తారు. ఇందులో మహావిష్ణువు, కాలభైరవుడు, దక్షిణామూర్తి, నవగ్రహాలతోపాటు అగస్త్యుడు, అంగీరస మహర్షి విగ్రహాలు కూడా ఉన్నాయి. ఈ ఆలయంలోని అమ్మను దర్శించుకున్న వారికి మనసులోని కోర్కెలు నెరవేరుతాయని విశ్వాసం. వర్షాలు పుష్కలంగా కురిసి దేశం సుభిక్షంగా ఉండటం కోసం ఏటా ఇక్కడ పూజలు నిర్వహిస్తారు. ఏటా మే మొదటి వారంలో కాళికంబాల్ అభిషేకం పేరుతో వర్షాల కోసం పూజలు నిర్వహించడం 1985 నుంచి ఆనవాయితీగా వస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.