యాప్నగరం

ఈ ఐదు అలవాట్లతో జీవితాంతం పేదరికంలోనే..

మీ అరచేతిల్లో సంపాదన రేఖ జెర్రిపోతులా ఉన్నా ఈ అయిదు అలవాట్లు ఉంటే ఏం లాభం? వచ్చిన ఆదాయం వచ్చినట్లే ఖర్చువుతుంది.

TNN 6 Jan 2017, 7:05 pm
మీ అరచేతిల్లో సంపాదన రేఖ జెర్రిపోతులా ఉన్నా ఈ అయిదు అలవాట్లు ఉంటే ఏం లాభం? వచ్చిన ఆదాయం వచ్చినట్లే ఖర్చువుతుంది. పేద, మధ్య తరగతి, ఉన్నత కుటుంబాల్లో జన్మించి వాళ్లు ఎవరైనా చెడు అలవాట్లను దూరం చేసుకుంటే జీవితంలో ఉన్నత స్థానాలకు చేరుకుంటారు.
Samayam Telugu these 5 habits will ensure you remain poor all your life
ఈ ఐదు అలవాట్లతో జీవితాంతం పేదరికంలోనే..


సోమరితనం పెద్ద శత్రువుతో సమానమని హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. కొందరు పనిచేసేటప్పుడు బద్ధకంగా ఉంటారు. ఇలాంటి వారి చేతుల్లో నుంచి లక్ష్మీ తరలిపోతుంది. వీళ్లు జీవితంలో ఎప్పటికీ ధనవంతులు కాలేరు. కష్టపడి పనిచేసే చోట లక్ష్మీ కొలువుంటుంది. శ్రీకృష్ణుని స్నేహితుడు సుధాముడు జీవితమే దీనికి ఉదాహరణ. సోమరితనంతో ద్వారకను దర్శించకపోవడంతో జీవితాంతం పేదవాడిగానే ఉన్నాడని అంటారు.

హిందూ పురణాల ప్రకారం మధ్యపానం అనేది ఓ చెడు అలవాటు. మధ్యానికి బానిసగా మారితే జ్ఞానంతోపాటు సంపదలు తరిగిపోతాయట. తాగుబోతులకు అహంకారంతోపాటు ఆత్మవిశ్వాసం మెండుగా ఉంటాయట. టన్నుల కొద్ది డబ్బు సంపాదిస్తే ఏంలాభం. తాగితే సంపద మంచు కొండలా తరిగిపోతుందట. మధ్యానికి బానిసలుగా మారితో అతడితోపాటు కుటుంబం కూడా చిక్కుల్లో పడుతుందట.

మోసం చేసేవాళ్లు నేరుగా నరకానికే పోతారట. స్త్రీ లేదా పురుషులు అక్రమ సంబంధాలు పెట్టుకుంటే వారి జీవితం చిన్నాభిన్నం అవుతుంది. బతికున్నప్పుడే కాదు చనిపోయాక కూడా ఇలాంటి వాళ్లకు తిప్పలు తప్పవట. దీనికి అహల్య, రావణాసురుని జీవితాలే ఉదాహరణ. గౌతమి మహర్షి భార్య అహల్యను మోహించిన ఇంద్రుడు మోసంతో ఆమెను లోబరచుకుంటాడు. సంధ్యావందనానికి వెళ్లినప్పుడు మహర్షి రూపంలో అహల్య దగ్గరకు వచ్చిన ఇంద్రుడు ఆమెతో శృంగారంలో పాల్గొంటాడు. దీన్ని గ్రహించిన గౌతముడు అహల్యను రాయిగా మారిపోతావని శపిస్తాడు. ఇక సీతను అపహరించిన రావణుడి జీవితం ఏమయ్యిందో రామాయణం తెలిపింది.

పగటి నిద్ర పనికి చేటు అనేది హిందూ పురాణాల్లో పేర్కొన్నారు. పగటి నిద్ర అలవాటు చేసుకుంటే సంపదలతోపాటు విజయాలు కూడా దూరమవుతాయట. పగలు అదేపనిగా నిద్రపోయేవారి ఇళ్లలో నుంచి లక్ష్మీదేవి తరలిపోవడమే కాదు ఎప్పటికి వారిని అనుగ్రహించదట. పగలు నిద్రపోయేవారు జీవితంలో గెలవలేరు, అంతే కాదు ధనాన్ని కూడా కూడబెట్టుకోలేరని గీతలో శ్రీకృష్ణుడు తెలిపాడు. పగటిపూట నిద్రించేవారు దెయ్యాలతో సమానమట.


పేకాటరాయుళ్లు, జూదగాళ్లు చనిపోయాక నేరుగా నరకానికే పోతారట. వీటి వల్ల కుటుంబమే సర్వనాశనమవుతుంది. దీనికి ఉదాహరణ మహాభారతంలో పాండవులు ఆడిన మాయా జూదం. జూదం అడటంతోనే రాజ్యాన్ని, ద్రౌపదిని పోగొట్టుకున్నారు. బెట్టింగులు, జూదాలు, లాటరీలు ధన నష్టానికి సంకేతమని హిందూ పురాణాలు పేర్కొన్నాయి.


ఒంటిమీద నూలుపోగు లేకుండా స్నానం చేస్తే రోగాలు బారిన పడతారట. ఏదో ఒక అచ్చాదనంతోనే స్నానం చేయాలట. దీని గురించి పద్మపురాణం, భగవద్గీతల్లో పేర్కొన్నారు. శ్రీకృష్ణుడు గోపికల చీరలు ఎత్తుకుపోవడానికి కూడా కారణం ఉందట. వివస్త్రులైన స్నానం చేస్తున్న గోపిలకు జ్ఞానోదయం కలిగించడానికే కృష్ణుడు వారి చీరలను దొంగిలించాడు. ఈ అంశంపై వాదించిన గోపికలకు కృష్ణుడు గంగ పవిత్రమైనదని, వివస్త్రంగా వెళ్లి అపవిత్రం చేయరాదని వారికి బోధించాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.