యాప్నగరం

మరణం గురించి బుద్ధుడు ఏం చెప్పాడంటే...

రాజ్యాన్ని త్వజించి ఆత్మ ఙ్ఞానాన్ని వెదుకుతూ బయలుదేరిన సిద్దార్థుడు బుద్ధుడిగా మారి బౌద్ధమతాన్ని ఏర్పాటు చేశాడు.

TNN 20 Mar 2017, 3:24 pm
బుద్ధుడి శిష్యుడొకరు మరణం తాలుకా రహస్యం ఏంటో చెప్పమంటూ ఓ రోజు ప్రశ్నిస్తాడు. దీనికి బుద్ధుడు చిన్నగా నవ్వి ఓ బాణం నీ చేతికి తగిలి గాయం చేసినప్పుడు దానిని ఆ ప్రాంతం నుంచి తొలిగించడానికి చూస్తావా లేదా అది ఎక్కడ నుంచి, ఏ దిశలో వచ్చిందో చూస్తావా? ముందు తెలియజేమంటూ తిరిగి ప్రశ్నిస్తాడు. బాణం తగిలిన ప్రదేశం నుంచి తొలగించడానికి ప్రయత్నిస్తాను, ఎందుకంటే దానిలో విషం నా శరీరమంతా వ్యాపింపజేస్తుంది కాబట్టి అని ఆ శిష్యుడు బదులిచ్చాడు.
Samayam Telugu this is how gautam buddha explained what happens after death to a disciple
మరణం గురించి బుద్ధుడు ఏం చెప్పాడంటే...


దీనికి సిద్ధార్థుడు స్పందిస్తూ నీవు చెప్పిన సమాధానం తిరుగులేనిది. ప్రపంచంలోని ఏదైనా సమస్యకు ముందు పరిష్కారం ఆలోచించాలి. వ్యక్తి మరణించిన తర్వాత ఈ ప్రపంచం ఏమవుతుందోనని సందేహం అనవసరమని పేర్కొన్నాడు. దీంతో ఆ శిష్యుడు తన గురువు అంతరంగాన్ని గ్రహించి, అవగాహన చేసుకున్నాడు. అతడి ఉత్సుకతను కూడా బుద్ధుడి అభినందించాడు.

ఒకసారి బుద్ధుడు ఉపన్యాసాన్ని ముగించిన తర్వాత ప్రియ శిష్యుడైన ఆనందుడితోపాటు మరి కొందరుతో కలిసి వెల్లేటప్పుడు అనేక ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడు. ఉపన్యాస వేదిక నుంచి బుద్ధుడిని అనుసరిస్తూ కొంత మంది బయలుదేరారు. వారి వెంట వస్తోన్నవారిలో ఓ నృత్య‌కారుడు ఇలా అన్నాడు. మీ ప్రసంగం వల్ల నేను నృత్య‌ ప్రదర్శన ఇవ్వడం మరచిపోయాను, మీరు నా కర్తవ్యాన్ని గుర్తుచేసినందుకు ధన్యవాదాలు అన్నాడు.

దొంగతానికి వచ్చిన నేను అసలు విషయం మరచి మీ ప్రసంగాన్ని వింటూ కూర్చున్నానని ఓ దొంగ తెలిపాడు. నా ప్రియమైన వారికి కోసం జీవితాంతం దొంగతం చేశాను...అయితే చావుకు దగ్గరగా ఉన్న నా జీవితం వృథా అయ్యింది. కాబట్టి ఈ క్షణం నుంచి నేను మోక్షం కోసం ప్రయత్నిస్తానని ఆ చోరుడు అన్నాడు. ఇలా ఎవరి సమస్యను వారు చెబుతూ అక్కడ నుంచి వెళ్లిపోయారు.

అప్పుడు ఆనందుడి వంక చూస్తూ కేవలం నేను ఇచ్చిన ఒకే ప్రకటనను వివిధ రకాల వ్యక్తులు,వారి జీవితాల అధారంగా అనేక విధాలు అవగాహన చేసుకున్నారు... దీని అర్థం ఏంటంటే వ్యక్తులు ఏం కోరుకుంటారో వాటిపై దృష్టిసారించి విస్తృతం చేస్తారని పేర్కొన్నాడు. బుద్ధుడు ఓ రోజు మామిడి చెట్టు కింది కూర్చుని ధ్యానం చేస్తుండగా కొందరు పిల్లలు అక్కడకు చేరుకుని మామిడి కాయల కోసం రాళ్లు రువ్వుతూ కింద పడుతున్న వాటిని ఏరుకుంటున్నారు.

వారి విసిరిన రాళ్లలో ఒకటి బుద్ధుడి తలను తాకింది. భరించరాని నొప్పితో విలవిలలాడిన బుద్ధుడు కళ్ల వెంబడి నీరు కారుతోంది. దీన్ని గమనించిన ఆ పిల్లలు భయపడిపోయి సిద్దార్థుడికి క్షమాపణ చెప్పారు. పిల్లల భయాన్ని పోగొట్టడానికి బుద్ధుడు వారికి ధైర్యం చెబుతాడు. తనకు రాళ్లు తగలడంతో బాధ పడటం లేదని కాయలిచ్చే చెట్టుకు తగిలినందకు విచారంగా ఉందని అన్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.