యాప్నగరం

ఈ ఆలయంలోకి వెళితే మృత్యువును ఆహ్వానించడమే!

మత సంబంధమైన ప్రార్థనల కోసం హిందువులు దేవాలయాలు, ముస్లింలు మసీదులు, క్రైస్తవులు చర్చిలు వినియోగిస్తారు.

TNN 4 Dec 2022, 5:40 pm
మత సంబంధమైన ప్రార్థనల కోసం హిందువులు దేవాలయాలు, ముస్లింలు మసీదులు, క్రైస్తవులు చర్చిలు వినియోగిస్తారు. దాదాపు అన్ని మతాలలోను ఇవి పవిత్రమైన ప్రదేశాలుగా భావింపబడుతాయి. దేవుడు' లేదా 'దేవత' ఉండే ప్రదేశం కాబట్టి 'దేవాలయం' పేరుతో పిలుస్తారు. వివిధ మతాల సంప్రదాయాలు, నిర్మాణ రీతులు, నిర్వహణా విధానాలు ప్రకారం వీటి నిర్మాణం జరుగుతుంది. శ్రీ వైఖానస శాస్త్రం ప్రకారం భక్తజనుల సౌకర్యార్థం భగవంతుడు అర్చారూపియై భూలోకానికి వచ్చాడు. ప్రతి దేవాలయంలోను ద్వారపాలకులు, పరివార దేవతలు, ప్రాకార దేవతలు ఆయా స్థానాల్లో ఆవాహనం చేయబడతారు. అయితే మృత్యువు కొలువుండే ఆలయం కూడా మన దేశంలో ఉంది. అక్కడకు వెళ్లడానికి భక్తులు భయపడతారు.
Samayam Telugu Yamraj Temple


చారిత్రికంగా కూడా ఈ ఆలయానికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ ఆలయంలో మృత్యుదేవత అయిన యమధర్మరాజు కొలువుంటాడు. భారతదేశంలోనే మృత్యుదేవత యమరాజు ఉండే ఆలయం ఇదొక్కటే. బహుశా భూమ్మీద కూడా ఇదొక్కటే. ఇది హిమాచల్ ప్రదేశ్ చంబల్ జిల్లా బర్మార్‌లో ఉంది. దీని అసలు పేరు బ్రహ్మపుర. ఈ ఆలయం ఇల్లు ఆకారంలా ఉంటుంది. ఇందులోని మృత్యుదేవత నివాసాన్ని సందర్శించడానికి భయపడతారు. కాబట్టి బయట నుంచే ప్రార్ధనలు చేసి వెళ్లిపోతారు. ఈ ఆలయంలోని ఒక గదిలో యమధర్మరాజు సహాయకుడు చిత్రగుప్తుడికి అంకితం చేశారు. చిత్రగుప్తుడు మానవుల పాపపుణ్యాలను నమోదు చేస్తాడు. ఈ ఆలయంలో బంగారం,వెండి, కాంస్యం,ఇనుముతో చేసిన నాలుగు అదృశ్య తలుపులు ఉన్నాయని నమ్ముతారు.

పురాణాల ప్రకారం మరణించిన వారి ఆ ఆత్మ ఏ ద్వారం నుంచి వెళ్లాలో యమరాజు నిర్ణయిస్తాడు. ఈ ఆత్మ చిత్రగుప్తుని వద్దకు ముందు చేరుతుంది. అక్కడ నుంచి పాపకర్మల ఆధారంగా ఏ ద్వారం నుంచి లోనికి ప్రవేశించాలనేది చిత్రగుప్తుడి లెక్కల ప్రకారం నిర్ణయిస్తాడు. దీనికి బ్రహ్మ కుమారుడు శ్రావణుడి సాయం తీసుకుంటాడు. గరుడు పురాణంలోనూ నాలుగు రహస్య ద్వారాలు గురించి ప్రస్తావన ఉంది. మరణించిన తర్వాత మాత్రమే యమపురికి చేరుకునే మానవులు జీవించి ఉండగా ఈ ఆలయంలోకి ప్రవేశించడానికి భయపడతారు. మృత్యువును వెంటబెట్టుకుని వచ్చేది యముడు. మరి అలాంటి యమధర్మరాజు కొలువైవున్న ఈ ఆలయాన్ని సందర్శించడానికి ఎవరు ధైర్యం చేస్తారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.