యాప్నగరం

తిరుమల బ్రహ్మోత్సవాలు.. పెద్ద శేషవాహనంపై ఊరేగిన శ్రీవారు

వైభవంగా అఖిలాండ బ్రహ్మాండ నాయకుడి బ్రహ్మోత్సవాలు.. పెద్ద శేషవాహనంపై మాడ వీధుల్లో విహరించిన శ్రీవారు.

Samayam Telugu 13 Sep 2018, 10:39 pm
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వాహన సేవలో భాగంగా తొలి రోజు మలయప్ప స్వామి ఉభయదేవేరులతో కలిసి పెద్ద శేషవాహనంపై తిరుమాడ వీధుల్లో విహరించారు. నిరంతరం శ్రీనివాసుని సేవలో తరించే ఆదిశేషువునే బ్రహ్మోత్సవాల్లో తొలివాహనంగా చేసుకోవడం భగవంతుని కరుణాముద్రకు తార్కాణం. అందుకే అన్నమయ్య తన కీర్తనల్లో తిరుమల కొండలను పదివేల శేషుల పడగల మయముగా వర్ణించాడు.
Samayam Telugu PeddaSesha Vahanam


పెద్ద శేషవాహనంపై ఊరేగిన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. నిత్యం స్వామిసేవలో ఉండే ఆదిశేషునిపై శ్రీవారిని వీక్షించడం ఎంతో పుణ్యదాయకమని భక్తుల నమ్మకం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.