యాప్నగరం

జులై 16న తిరుమలకు వెళ్లకపోవడమే మంచిది.. కారణం ఇదే!

అణివారం ఆస్థానం సందర్భంగా జులై 16 శ్రీవారి ఆలయంలో కోయిల్ అళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నారు. దీంతోపాటు అదే రోజు రాత్రి 7 గంటలకు శ్రీవారి ఆలయాన్ని మూసివేయనున్నారు.

Samayam Telugu 25 Jun 2019, 2:59 pm
2019లో ఐదు సూర్య, చంద్ర గ్రహణాలు ఏర్పడనుండగా వీటిలో రెండు సంపూర్ణ సూర్య గ్రహణాలు, ఒకటి సంపూర్ణ చంద్రగ్రహణం. కొత్త ఏడాది ప్రారంభమైన తొలివారంలోనే సూర్యగ్రహణం సంభవించింది. ఇది జరిగిన 15 రోజుల తర్వాత చంద్రగ్రహణం ఏర్పడింది. జనవరి 6 పాక్షిక సూర్యగ్రహం, జనవరి 21న సంపూర్ణ చంద్రగహణం ఏర్పడ్డాయి. ఇది ఆసియా, ఫసిఫిక్ తీరం, అమెరికా, ఐరోపా, ఆఫ్రికా దేశాల్లో కనిపించింది. ఈ ఏడాది రెండో చంద్ర గ్రహణం జులై 16 అర్ధరాత్రి దాటిన తర్వాత 1.31 గంటలకు సంభవించనుంది. ఇది తెల్లవారుజాము 4.29 గంటల వరకు ఉంటుంది. దీంతో తిరుమలలో శ్రీవారి ఆలయాన్ని జులై 16న రాత్రి 7 నుంచి మర్నాడు అంటే 17 తెల్లవారుజామున 5 గంటల వరకు మూసివేయనున్నారు. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించి, ఈ విష‌యాన్ని భ‌క్తులు గ‌మ‌నించాల‌ని కోరింది.
Samayam Telugu Tirumala


జులై 17 బుధ‌వారం ఉద‌యాత్పూర్వం 1.31 నుంచి 4.29 గంట‌ల వ‌ర‌కు చంద్రగ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటల ముందు ఆలయం మూసివేయడం ఆనవాయితీ. జులై 17న ఉదయం 5 గంటలకు సుప్రభాతంతో ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్యహవచనం నిర్వహిస్తారు. అనంతరం తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహించనున్నారు. అనంతరం ఉదయం 11 గంటలకు సర్వదర్శనం ప్రారంభవుతుంది. ఈ నేపథ్యంలో జులై 16న మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం, చంద్రగ్రహణం కారణంగా అష్ట‌ద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న‌, వ‌సంతోత్స‌వం, స‌హ‌స్ర‌దీపాలంకార సేవ‌లను టీటీడీ ర‌ద్ద‌ుచేసింది. అలాగే జులై 17న ఆణివార ఆస్థానం కార‌ణంగా కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్స‌వం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.