యాప్నగరం

ఎస్బీఐలో 2,780 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిన టీటీడీ

కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలకు దేశవిదేశాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో వస్తారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు నగదు, వస్తువుల రూపంలో కానుకలు సమర్పించుకుంటారు.

TNN 29 Aug 2017, 2:25 pm
కలియుగ వైకుంఠంగా పేరుగాంచిన తిరుమలకు దేశవిదేశాల నుంచి భక్తులు విశేష సంఖ్యలో వస్తారు. శ్రీవారిని దర్శించుకున్న భక్తులు నగదు, వస్తువుల రూపంలో కానుకలు సమర్పించుకుంటారు. శ్రీనివాసునికి భక్తులు సమర్పించిన బంగారాన్ని దీర్ఘకాల గోల్డ్ డిపాజిట్ పథకం కింద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో జమ చేసినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం ప్రకటించింది. ప్రపంచంలోనే అత్యధిక ఆదాయం లభించే హిందూ దేవాలయంగా విరాజిల్లుతోన్న తిరుమల శ్రీవారికి కానుకలుగా వచ్చిన బంగారంలోని 2,780 కిలోలు ఎస్బీఐలో డిపాజిట్ చేశామని పేర్కొంది. ఈ మొత్తంలో 2,075 కిలోలను 12 సంవత్సరాల కాలపరిమితికి 2.5 శాతం వార్షిక వడ్డీపై గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ కింద పెట్టుబడిగా పెట్టనట్లు అధికారులు వెల్లడించారు. ఈ డిపాజిట్‌పై ఎస్బీఐ నుంచి సర్టిఫికెట్లు అందాయని తెలిపారు.
Samayam Telugu tirumala tirupati devasthanams deposits 2780 kg gold with sbi
ఎస్బీఐలో 2,780 కిలోల బంగారాన్ని డిపాజిట్ చేసిన టీటీడీ


గతేడాది పంజాబ్ నేషనల్ బ్యాంకులో స్వామివారికి చెందిన 1,311 కిలోల బంగారాన్ని టీటీడీ డిపాజిట్ చేసిన సంగతి తెలిసిందే. మిగతా బంగారాన్ని కరిగించి, స్వామివారి రూపంలో నాణేలు తయారుచేసి భక్తులకు అందుబాటులో ఉంచుతామని తెలిపారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలో భక్తుల నుంచి కానుకల రూపంలో రూ. 1,110 కోట్లు వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వివిధ బ్యాంకుల్లో గతంలో చేసిన డిపాజిట్లపై రూ. 807 కోట్ల వడ్డీ లభించింది. ఇతర మార్గాలైన రూ. 300 ప్రత్యేక దర్శనం పథకం నుంచి రూ. 256 కోట్లు, గదుల అద్దెల రూపంలో రూ. 124 కోట్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల విక్రయం ద్వారా రూ. 55 కోట్లు వస్తుందని అధికారులు వెల్లడించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.