యాప్నగరం

అక్టోబరుకు సేవా టిక్కెట్లను విడుదల చేసిన టీటీడీ

అక్టోబరు నెలకు సంబంధించి శ్రీవారి అన్ని సేవలకు టిక్కెట్ల తిరుమల తిరుపతి దేవస్థానం అందుబాటులోకి ఉంచింది. సుమారు 56,295 టిక్కెట్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది.

TNN 7 Jul 2017, 11:04 am
అక్టోబరు నెలకు సంబంధించి శ్రీవారి సేవా టికెట్లను అందుబాటులో ఉంచినట్లు టీటీడీ వెల్లడించింది. అన్ని సేవలకు కలిపి మొత్తం 56,295 సేవా టికెట్లను విడుదల చేశామని, వీటిలో 12,495 సేవా టిక్కెట్లను లక్కీ డిప్ ద్వారా ఎంపిక చేసి కేటాయిస్తామని తెలిపింది. సుప్రభాత సేవకు 7,780, అర్చనకు 120, తోమాల సేవకు 120, అష్టదళపాద పద్మారాధనకు 300, నిజరూప దర్శనానికి 2,300, విశేషపూజకు 1,875 టికెట్లను ఆన్‌లైన్లో ఉంచినట్లు తెలిపింది. స్వామివారిని సేవలో పాల్గొనాలకునే భక్తులు ఆన్‌లైన్‌లో ఆధార్ సంఖ్యతో ఈ రోజునుంచి నమోదు చేసుకోవాలని, వీరికి 14వ తేదీ మధ్యాహ్నం 12 గంటల తర్వాత టికెట్లను కేటాయిస్తామని పేర్కొంది.
Samayam Telugu tirumala tirupati devasthanams released month of october seva tickets
అక్టోబరుకు సేవా టిక్కెట్లను విడుదల చేసిన టీటీడీ


టికెట్లను పొందిన వారికి ఈ-మెయిల్, ఎస్ఎంఎస్ ద్వారా సమాచారాన్ని అందజేస్తామని, మూడు రోజుల్లోగా సేవలకు డబ్బులు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేసింది. అయితే కల్యాణోత్సవం, వసంతోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలకు ఆన్‌లైన్‌లో నేరుగా టికెట్లను కొనుగోలు చేయవచ్చని తెలిపింది. కల్యాణోత్సవానికి 10,500, ఊంజల్ సేవకు 2,800, వసంతోత్సవానికి 11,180, ఆర్జిత బ్రహ్మోత్సవానికి 6,020, సహస్ర దీపాలంకార సేవకు 13,300 టికెట్లను అందుబాటులో ఉంచామని వెల్లడించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.