యాప్నగరం

తిరుపతి: కపిలేశ్వరాలయంలో ఘనంగా తెప్పోత్సవం

తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో అయిదు రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు సోమవారం (జనవరి 1) ఘనంగా ముగిశాయి.

TNN 2 Jan 2018, 12:26 am
తిరుపతిలోని శ్రీ కపిలేశ్వర స్వామి ఆలయంలో అయిదు రోజుల పాటు జరిగిన తెప్పోత్సవాలు సోమవారం (జనవరి 1) ఘనంగా ముగిశాయి. చివరి రోజు సాయంత్రం 6.30 నుంచి 7.30 గంటల వరకు శ్రీచండికేశ్వర స్వామి, శ్రీచంద్రశేఖర స్వామివార్లను తెప్పలపై తొమ్మిది చుట్లు తిరిగి భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ఉత్సవాలకు భారీ సంఖ్యలో హాజరైన భక్తజనం తన్మయత్వంతో పొంగిపోయారు. తెప్పోత్సవాల్లో భాగంగా మొదటి రోజు శ్రీ వినాయకస్వామి, రెండో రోజు శ్రీ సుబ్రమణ్య స్వామి, మూడో రోజు శ్రీ సోమస్కందస్వామి, నాలుగో రోజు శ్రీ కామాక్షి అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు.
Samayam Telugu tirupati annual float festival in kapileswara temple
తిరుపతి: కపిలేశ్వరాలయంలో ఘనంగా తెప్పోత్సవం


మంగళవారం ఆరుద్ర దర్శన మహోత్సవం సందర్భంగా ఉదయం 5.30 నుంచి 9.30 గంటల వరకు శ్రీ నటరాజస్వామి, శ్రీ శివగామి అమ్మవారు, శ్రీ మాణిక్యవాసగ స్వామివారి ఉత్సవ విగ్రహాలను పురవీధులలో ఊరేగించనున్నారు.

ఈ వేడుకలను తిలకించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో ఆలయం జనసందోహంగా మారింది. తెప్పోత్సవం ఆద్యంతం నయనానందకరంగా సాగింది. భక్తులకు తగినట్లుగా అధికారులు ఏర్పాట్లు చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.