యాప్నగరం

శపథం వీడి శ్రీవారి సేవకు చిన్నజీయర్!

అభివృద్ధి పేరిట గతంలో కూల్చివేసిన వెయ్యి కాళ్ల మండపాన్ని తిరిగి పునర్మించేంత వరకూ తిరుమలలో అడుగుపెట్టనని, శ్రీవారిని దర్శించుకోనని శపథం చేసిన త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి మెట్టుదిగారు.

TNN 7 Sep 2017, 11:50 am
అభివృద్ధి పేరిట గతంలో కూల్చివేసిన వెయ్యి కాళ్ల మండపాన్ని తిరిగి పునర్మించేంత వరకూ తిరుమలలో అడుగుపెట్టనని, శ్రీవారిని దర్శించుకోనని శపథం చేసిన త్రిదండి శ్రీమన్నారాయణ చిన జీయర్ స్వామి మెట్టుదిగారు. స్వామివారిపై అలకవీడిన ఆయన బుధవారం సాయంత్రం తిరుమలకు చేరుకుని, శ్రీవారి పున్నమి గరుడ సేవలో సుమారు 20 నిమిషాలు పాటు పాల్గొన్నారు. అలాగే ఈ ఉదయం స్వామివారి సేవలో మునిగిపోయారు. గతంలో వెయ్యి కాళ్ల మండపం నిర్మించకుంటే, స్వామిని దర్శించుకునేది లేదని ప్రతిన బూనిన ఆయన, తన శిష్య బృందంతో సహా వచ్చి శ్రీనివాసుని దర్శించుకున్నారు.
Samayam Telugu tridandi china jeeyar swamy visited after ling time
శపథం వీడి శ్రీవారి సేవకు చిన్నజీయర్!


అనంతరం జీయర్ స్వామి మీడియాతో మాట్లాడుతూ, వెయ్యి కాళ్ల మండపం నిర్మాణానికి అడ్డంకులు తొలగిపోనున్నాయని తెలిపారు. అలాగే స్వామి సంకల్పం అనకూలంగానే ఉందని, దానికి అవసరమైన మార్గాలన్నీ సుగుమంగానే ఉన్నాయని అన్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా నడచుకునే పాలకులు ఇప్పుడున్నారని జీయర్ స్వామి వ్యాఖ్యానించారు. శ్రీరామానుజాచార్యుల సహస్రాబ్ది ఉత్సవాలను టీటీడీ ఘనంగా నిర్వహిస్తోందని కితాబిచ్చారు. తన శిష్య బృందంతో కలిసి వచ్చిన చిన జీయర్ స్వామికి ఆలయ అధికారులు స్వాగతం పలికారు. శపథం చేసినట్లే నాలుగేళ్ల కిందట కాలినడకన తిరుమలకు విచ్చేసినా, రామస్థూపాన్ని దర్శించుకుని తిరిగి వెళ్లిపోయారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.