యాప్నగరం

బ్రహోత్సవాలు విజయవంతంగా నిర్వహించాం: టీటీడీ

శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు చక్రస్నాన కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామివారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం నిర్వహించారు.

TNN 1 Oct 2017, 3:00 pm
శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా తొమ్మిదో రోజు చక్రస్నాన కార్యక్రమం వైభవంగా జరిగింది. స్వామివారి చివరి రూపమైన అర్చా విగ్రహానికి చక్రస్నానం నిర్వహించారు. వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారు, ఉభయ దేవేరులు, చక్రత్వాళ్వారుకి స్నపన తిరుమజనం జరిగింది. తర్వాత స్వామి వారి ప్రతినిధిగా చక్రత్వాళ్వారుకి వరాహ పుష్కరిణిలో స్నానమాచరింపజేశారు. చక్రస్నానం తర్వాత తిరుమలేశుడు ఆనంద నిలయానికి చేరుకున్నారు. శ్రీవారి అవతార నక్షత్రమైన శ్రవణ పర్వదినాన చక్రస్నాన కార్యక్రమం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. చక్రస్నానం ద్వారా భక్తులకు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుందని విశ్వాసం.
Samayam Telugu ttd eo told to media brahmotsavam successfully celebrates with cm suggestion
బ్రహోత్సవాలు విజయవంతంగా నిర్వహించాం: టీటీడీ


చక్రతీర్థ స్నానంతో తిరుమల శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహోత్సవాలు ఆదివారం ఉదయం ఘనంగా ముగిసాయి. చంద్రబాబు సూచనలతో బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహించామని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘల్ పేర్కొన్నారు. టీటీడీ ఈఓ మీడియాతో మాట్లాడుతూ... శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా నిర్వహించామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా వాహన సేవలు, మూలవిరాట్ దర్శనం కల్పించామని తెలిపారు. బ్రహ్మోత్సవాలు విజయవంతం అయ్యేలా చంద్రబాబు ఎప్పటికప్పుడు సూచనలు చేశారని, బ్రహ్మోత్సవాల్లో 6.27 లక్షల మంది శ్రీవారిని దర్శించుకున్నారని వెల్లడించారు. హుండీ ద్వారా రూ.18.70 కోట్ల ఆదాయం లభించిందని,

గత ఏడాదితో పోలిస్తే ఈసారి భక్తుల సంఖ్య, హుండీ ఆదాయం తగ్గిందని ఆయన అన్నారు. 23 లక్షల మందికి అన్న ప్రసాద వితరణ, 26.55 లక్షల లడ్డూలు పంపిణీ చేశామని తెలిపారు. అలాగే 3.06 లక్షల మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించకున్నారని తెలిపారు. త్వరలో తమిళం, కన్నడ భాషల్లో టీటీడీ ఆన్ లైన్ సేవలు అందిస్తామని, ఈ నెల 18, 25 తేదీల్లో నాలుగు వేల మంది వయోవృద్ధులు, వికలాంగులకు, ఈ నెల 19, 26 తేదీల్లో ఐదేళ్లలోపు చిన్నారుల తల్లిదండ్రులకు ప్రత్యేక దర్శనాలు ఏర్పాటు చేశామని అనిల్ కుమార్ సింఘాల్ తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.