యాప్నగరం

ధ్యానమనోప్రస్థాన కేంద్రంలో ఉగాది వేడుకలు

శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో సైన్స్ యూనివర్స్, బండ్లగూడ జాగీర్ ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ధ్యానమనోప్రస్థాన కేంద్రంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు.

Samayam Telugu 18 Mar 2018, 6:18 pm
శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వస్ఫూర్తి దివ్య ఆశీస్సులతో సైన్స్ యూనివర్స్, బండ్లగూడ జాగీర్ ఆధ్వర్యంలో విళంబి నామ సంవత్సర ఉగాది వేడుకలను ధ్యానమనోప్రస్థాన కేంద్రంలో భక్తులు అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉగాది వేడుకల్లో భాగంగా ధ్యానమనోప్రస్థాన కేంద్రానికి విచ్చేసిన ప్రజలకు ఆసన, ప్రాణామాయ, ధ్యాన విధానాల గురించి అవగాహన కల్పించారు. తర్వాత పంచాంగ శ్రవణం చేశారు. ఈ మేరకు ధ్యానమనోప్రస్థానం ఒక ప్రకటనను విడుదల చేసింది.
Samayam Telugu ugadi celebrations in sri sri sri viswa guru spoorthis dhyana mano prasthanam
ధ్యానమనోప్రస్థాన కేంద్రంలో ఉగాది వేడుకలు


ఈ ఆధునిక సమాజంలో మానవత్వతో మనిషి మనుగడ జరగాలన్నదే ధ్యేయం. అందుకు మనసులోనే పరివర్తన రావాలి. దానికి ఆసన, ప్రాణయామ, ప్రస్థాన ధ్యానం అవసరం. తద్వారా ఆత్మీయ సమాజం ఏర్పడుతుంది అని గురు విశ్వస్ఫూర్తి తెలియజేసినట్లు ప్రకటనలో పేర్కొన్నారు.

మరోవైపు.. ఉగాది వేడుకల్లో భాగంగా సామూహిక ధ్యానం, ఉచిత వైద్య శిబిరం, పుస్తక ప్రదర్శన, పేదలకు వస్త్ర దానం, మహా ప్రసాద కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినట్లు ధ్యానమనోప్రస్థాన కేంద్రం వెల్లడించింది. ఈ ఉగాది పర్వదినాన హైదరాబాద్ తో పాటు ఇతర ప్రాంతాల్లో సుమారు 28 చలివేంద్రాలు ప్రారంభించినట్లు పేర్కొంది. ఒక్క హైదరాబాద్ లోనే 16 చలివేంద్రాలను ప్రారంభించినట్లు తెలిపింది.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.