యాప్నగరం

300 ఏళ్ల తర్వాత వస్తున్న పౌర్ణమి రోజు విష్ణువును పూజిస్తే...

హిందూ క్యాలెండర్‌ ప్రకారం వైశాఖ మాసానికి విశేష ప్రాధాన్యత ఉంది. పవిత్రమైన ఈ నెల శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనది. వైశాఖపూర్ణిమ అత్యంత విశేషమైంది.

TNN 9 May 2017, 3:59 pm
హిందూ క్యాలెండర్‌ ప్రకారం వైశాఖ మాసానికి విశేష ప్రాధాన్యత ఉంది. పవిత్రమైన ఈ నెల శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైనది. వైశాఖపూర్ణిమ అత్యంత విశేషమైంది. స్కంద పురాణం ప్రకారం ఈ రోజు శ్రీమహావిష్ణువును ఆరాధిస్తే అపార సంపదలతోపాటు మనసులోని కోరికలు నేరవేరతాయి, విష్ణువు అనుగ్రహం పొందుతారు. అంతే కాదు సత్యన్నారాయణ స్వామిని ఆరాధిస్తే కుటుంబానికి అదృష్టం వరిస్తుంది. భవిష్య పురాణం ప్రకారం శ్రీమన్నారాయణుడు కూర్మావతారం దాల్చింది ఈ రోజే. అమృతం కోసం దేవతలు, రాక్షసులు మందరగిరి పర్వతాన్ని కవ్వంగా, వాసుకిని తాడుగా చేసుకుని క్షీరసాగర మథనం ప్రారంభిస్తారు. అయితే మధ్యలో మందర పర్వతం మునిగిపోవడంతో దేవతలు మహావిష్ణువును వేడుకుంటారు.
Samayam Telugu vaishakh purnima today is the most auspicious day to pray to lord vishnu
300 ఏళ్ల తర్వాత వస్తున్న పౌర్ణమి రోజు విష్ణువును పూజిస్తే...


దేవతల ప్రార్థనలు మన్నించిన మహావిష్ణువు కూర్మ రూపం ధరించి పాలసముద్రం అడుగున ఉన్న మందర పర్వతాన్ని పైకి లేపాడు. కూర్మ రూపంలో శ్రీహరి అవతరించిన రోజు కాబట్టి దీన్ని కూర్మ జయంతి అంటారు. అందుకే వైశాఖ పౌర్ణమి రోజు నెయ్యి, పంచదార, నువ్వులను శ్రీమహావిష్ణువుకు నైవేధ్యంగా సమర్పించి ప్రార్థించాలి. ఓ పాత్ర నిండా నీళ్లు పోసి, సూర్యాస్తమయం తర్వాత విష్ణువు, కృష్ణుడు లేదా రాముడు ప్రతిబింబాన్ని ఇందులో చూడాలి. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాన్ని ఉచ్ఛరించాలి.

శంఖంలోని గంగాజలం పోసి విష్ణువు విగ్రహానికి అభిషేకం చేస్తే మోక్షం లభిస్తుంది. ఆహార ధాన్యాలు, పండ్లు, గొడుగు, పాదరక్షలు పేదలకు దానం చేస్తే జీవితంలో ఎదురైన అడ్డంకులు తొలగిపోతాయి.దారిలో మొక్కను నాటితే అది పెరిగి వృక్షంగా మారి భవిష్యత్తు తరాలకు నీడను ఇస్తుంది. దీని వల్ల ఎంతో పుణ్యం లభిస్తుంది.

పవిత్ర నదిలో స్నానం చేసి పసుపు రంగు పూలు, వస్త్రాలు, స్వీట్స్ విష్ణువుకు సమర్పించాలి. అలాగే శ్రీమహావిష్ణువు ప్రహ్లాదుడి కోరికపై నృసింహ‌ అవతారం దాల్చింది కూడా ఈ రోజేనని హిందువులు భావిస్తారు. నరసింహా అవతారంలో హిరణ్యకశిపుని సంహరించి ప్రహ్లాదుని రక్షించాడు. దీన్ని బుద్ధ పూర్ణిమాగానూ పేర్కొంటారు. బుద్ధుడికి ఈ రోజే రావి చెట్టు కింద జ్ఞానోదయం అయినట్లు చరిత్రకారులు తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.