యాప్నగరం

శృంగారానికి టైమింగే ముఖ్యం...

కాలానికి, కామానికి దగ్గరి సంబంధం ఉందట. అకాల కామంతో అనర్థాలే కాదు సకాలంలో జరగాల్సిన పనులను అడ్డుకుంటుందట.

TNN 4 Feb 2017, 4:42 pm
కాలానికి, కామానికి దగ్గరి సంబంధం ఉందట. అకాల కామంతో అనర్థాలే కాదు సకాలంలో జరగాల్సిన పనులను అడ్డుకుంటుందట. నిజానికి కామం కాలాతీతమైంది. కానీ వేళా పాలలేని కామకేళీ విలాసాలకు దాసులై హీనమైన జీవితాన్ని గడిపిన వారి కథలు పురాణాల్లో కోకొల్లలు. అలాంటి వారిలో ముఖ్యుడు భోజ వంశానికి చెందిన దాండక్యుడనే రాజు.
Samayam Telugu vastsayana kamasutra effects of erotism amorousness
శృంగారానికి టైమింగే ముఖ్యం...


దాండక్యుడు కామాంధుడు. అందమైన స్త్రీ కనపడితే ఆమెను అనుభవించే వరకూ స్థిమితంగా ఉండేవాడు కాదు. ఒక రోజు వేటకు వెళ్లినప్పుడు బాగా అలసిపోవడంతో అడవిలో కనిపించిన భార్గవ మహర్షి ఆశ్రమానికి చేరుకుంటాడు. దాండక్యుడు చేరుకునేసరికి భార్గవ మహర్షి ఆశ్రమంలో ఉండడు. అయితే ఆశ్రమంలోని పాలరాతి శిల్పంలా ఉన్న ముని కన్యను చూడగానే దాండక్యుడి మనసు చెలించింది. ఆమెను బలవంతంగా తన రథంపై ఎక్కుంచుకుని తీసుకుపోయాడు.

దర్బలు, సమిధల కోసం వెళ్ళిన భార్గవ మహర్షి కొంతసేపటి తర్వాత ఆశ్రమానికి చేరుకునేసరికి కుమార్తె కనిపించలేదు. చుట్టుపక్కల పరిసరాల్లో వెదికినా ఆమె జాడ కనిపించకపోవడంతో దివ్యదృష్టి సారించాడు. అసలు విషయం తెలుసుకున్న ముని పట్టరాని ఆగ్రహంతో బంధుమిత్ర సపరివార సమేతంగా నశించిపోతావని దాండక్యుడిని శపించాడు. అలా దాండక్యుడు అంతరించిపోయిన ప్రదేశమే ప్రస్తుత దండకారణ్యం.

ఇక అహల్య, ఇంద్రుడి కథ గురించి అందరికీ తెలిసిందే. గౌతమ మహర్షి భార్య అహల్య అపురూప సౌందర్యవతి. పురుషులను దాసోహం చేసే అందం ఆమెది. దేవతలకు ప్రభువైన ఇంద్రుడు సైతం ఆమెను మోహించాడు. మహర్షి లేని సమయంలో ఆశ్రమంలో ప్రవేశించి అహల్యను అనుభవించాడు. వారి రతి క్రీడ సాగుతుండగానే గౌతముడు ఆశ్రమానికి వచ్చాడు.

తనను సంతృప్తి పెట్టిన పురుషుడికి స్త్రీ ప్రాణం ఇవ్వడమే కాదు ప్రాణాపాయం నుంచి కాపాడుతుంది. అహల్య కూడా అలాగే చేసింది. ఇంద్రుడుని భర్త కంటపడకుండా తన గర్భంలో దాచింది. అదే సమయంలో గౌతముడికి వేరో చోటు నుంచి పిలుపు రావడంతో అహల్యను కూడా తన వెంట తీసుకెళ్లాడు. గౌతముడిని ఆహ్వానించిన వ్యక్తి అహల్యను చూడగానే దివ్యదృష్టితో అసలు విషయం తెలుసుకున్నాడు.

లెక్క ప్రకారం మూడు ఆసనాలు సిద్ధం చేశాడు. రెండు ఆసనాలు సరిపోతాయి కదా మూడోది ఎందుకని సందేహం వచ్చిన గౌతముడు తన యోగ దృష్టితో చూశాడు. అసలు రహస్యం బయటపడింది. ఈ పెద్ద మనిషి ఇంద్రుడి కోసం మూడో ఆసనం వేశాడా అని అనుకుని పట్టరాని కోపంతో సహస్ర భగడవుకమ్మని శపించాడు. కామాంధుడై పర స్త్రీని రమించినందుకు ఒళ్లంతా స్త్రీజననాంగాలతో ఇంద్రుడు దురావస్థ పడ్డాడు.

పురాణాల్లో ఇలాంటి కథలు లెక్కకు మిక్కిలి ఉన్నాయి. సీతను అపహరించిన రావణుడు, ద్రౌపదిని బలాత్కరించబోయిన కీచకుడు సర్వనాశమయ్యారు. కామం వల్ల ముప్పు తప్పదు. కాబట్టి కామశాస్త్రాన్ని చదావాల్సిన అవసరం లేదనుకోవచ్చు. మనసుని అదుపులో పెట్టుకుంటే సరిపోతుందను కోవచ్చు. అదుపులో పెట్టుకోవడం మంచిదే కానీ అసలు కామ శాస్త్రమే అక్కర్లేదనుకోవడం పొరపాటని వాత్య్సాయనుడు పేర్కొన్నాడు. దేహానికి తిండి, నిద్ర ఎంత అవసరమో శృంగారం కూడా అంతే అవసరం.

ఆరోగ్యానికి, శృంగారానికి అవినాభావ సంబంధం ఉంది. రెండోది నెరవేరితేనే మొదటిది కుదుటపడుతుందట. కామ వాంఛలను అణచిపెట్టుకోవడం వల్ల మానసిక ఆరోగ్యం దెబ్బతినే ప్రమాదం ఉందట. అలాగని పర స్త్రీలతో యథేచ్ఛగా శృంగారంలో పాల్గోమని కాదు. వావివరసలు చూసుకుంటూ సమయాన్ని పాటిస్తూ ముందుకు పొవాలని వాత్స్యాయనుడు వివరించాడు.

ఇంతవరకు బాగానే ఉంది. కోరికలు కలిగినపుడు అందుబాటులో ఉన్న స్త్రీతో రమిస్తే సరి....ఇక కామశాస్త్రం ఎందుకు? దీన్ని చదవకపోతే పురుషుడు సంభోగం చేయలేడా? అవుతుంది, కానీ అది గుడ్డెద్దు చేలో పడ్డట్టేనట. శాస్త్రం శక్తివంతమైనది. అందుకే దాని గురించి కూడా తెలుసుకోవాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.