యాప్నగరం

విష్ణు పురాణం ప్రకారం ఈ రోజువారీ పనులు అతిగా చేస్తే....

అష్టాదశ పురాణాల్లో విష్ణు పురాణం కూడా ఒకటి. వచనా శైలిలో ఉండే ఈ పురాణం సర్గ, ప్రతిసర్గ, వంశ, మాన్వంత్ర, వంశానుచరిత్రం అనే పంచలక్షణాల గురించి తెలియజేస్తుంది.

TNN 4 Jul 2017, 6:01 pm
అష్టాదశ పురాణాల్లో విష్ణు పురాణం కూడా ఒకటి. వచనా శైలిలో ఉండే ఈ పురాణం సర్గ, ప్రతిసర్గ, వంశ, మాన్వంత్ర, వంశానుచరిత్రం అనే పంచలక్షణాల గురించి తెలియజేస్తుంది. అయితే విష్ణుపురాణం ఎప్పుడు సంకలనం చేశారో, ఎవరు రాశారో మాత్రంకచ్చితంగా తెలీదు. దీన్ని అనేక మంది, అనేక సందర్భాల్లో సంకలనం చేశారు. ఇందులో ఆరు అధ్యాయాలు, 126 విభాగాలు ఉన్నాయి. మొదటి అధ్యాయంలో 22 భాగాలు, రెండో అధ్యాయంలో 16 భాగాలు, మూడో అధ్యాయంలో 18 భాగాలు, నాలుగో అధ్యాయంలో 24 భాగాలు ఉన్నాయి. ఐదు, ఆరు అధ్యాయాల్లో 38, 8 భాగాలు ఉన్నాయి. అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలు ఉన్నాయి.
Samayam Telugu vishnu purana facts doing these daily chores for a long period can really harm you
విష్ణు పురాణం ప్రకారం ఈ రోజువారీ పనులు అతిగా చేస్తే....


స్నానం అనేది మానవులకు చాలా ముఖ్యం. అయితే అతిగా చేస్తే అనర్థాలకు దారితీస్తుంది. ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల అనారోగ్యానికి గురికాకతప్పదు. సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నించాలి.

నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే. దీని వల్ల అనేక సమస్యలు తలెత్తే ఆస్కారం ఉంది. నిద్రపోయే సమయం, మేల్కోనే సమయాన్ని ఒకసారి పరీక్షించుకోండి. విష్ణుపురాణం ప్రకారం బ్రహ్మముహూర్తంలో మేల్కోవాలి.

జీవితంలో చాలా సమస్యలకు దారితీసే స్త్రీ, పురుషులకు శారీరక సంబంధాలపై నియంత్రణ ఉండాలి. వాస్తవానికి దీనికి ఎలాంటి తార్కికమైన వివరణ లేదు. అయితే మనసును సంచలంగా మార్చుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి.

రాత్రి సమయాల్లో కొన్ని విషయాలను విష్ణుపురాణం నిషేధించింది. ఎందుకంటే భూమిపై సృష్టి ఖచ్చితంగా విశ్వోద్భవ ప్రణాళికలో భాగంగా ఉంటుంది.

రాత్రి పూట రహదారులను దాటకూడదు. సామాజిక అంశాల ఉనికి ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతారు. దీని వల్ల సామాన్య మానవుడు ఇబ్బందులను ఎదుర్కోవలసి ఉంటుంది. శ్మశానాలను రాత్రి వేళలో సందర్శించరాదు. ఇక్కడ ఎప్పుడూ ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి కాబట్టి దీని వల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే ఈ ప్రదేశంలో పీల్చే గాలి ఆరోగ్యం, ఊపరితిత్తులకు హాని కలిగిస్తుంది. చెడు ప్రవర్తన, క్రూరమైన ఆలోచనలు కలిగిన వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్లు రాత్రివేళలో తమ కార్యక్రలాపాలను సాగిస్తారు. ఎప్పుడూ దూరంగా ఉండాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.