యాప్నగరం

తాను లేకపోతే నీలో సగభాగం లేనట్టే!

సతీదేవి పట్ల ఉన్న ప్రేమతో పరమేశ్వరుడు తన దేహంలో సగభాగం ఇచ్చి అర్థాంగిగా చేసుకున్నాడు. మరి శివుడిని వదిలి పెట్టి తండ్రి వద్దకు వెళ్ళిన సతీదేవి ఉదంతం మనకు తెలిసిందే

Samayam Telugu 2 Jul 2018, 5:08 pm
సతీదేవి పట్ల ఉన్న ప్రేమతో పరమేశ్వరుడు తన దేహంలో సగభాగం ఇచ్చి అర్థాంగిగా చేసుకున్నాడు. మరి శివుడిని వదిలి పెట్టి తండ్రి వద్దకు వెళ్ళిన సతీదేవి ఉదంతం మనకు తెలిసిందే. స్త్రీ సహజమైన బలహీనత పుట్టింటిపై ఉన్న మమకారంతో ఈశ్వరుని హిత వచనాలను పెడచెవిన పెట్టి సతీదేవి వెళుతుంది. భార్యాభర్తలు ఇరువురూ ఒక దేహంలో రెండు సగ భాగాలుగా ఉండాలని వేదాలు చెబుతున్నాయి. అంటే ఒకరు లేకపోతే మరొకరికి జీవితం అసంపూర్ణమనేది దీని అర్థం. భౌతిక జగత్తుకు ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు వందనీయులు. అందుకే ‘జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరం’ అన్నారు.
Samayam Telugu అర్థనారీశ్వరుడి అర్థం ఇదే


పార్వతీ.. దక్షప్రజాపతి కుమార్తె ‘సతి’గా ఉన్న సమయంలో తండ్రికి ఇష్టం లేకపోయినా, కోరి మరీ శివుని వివాహం చేసుకుంది. హృదయపూర్వకంగా ప్రేమించి, అర్థనారీశ్వరునిలో సగభాగం అయినా పుట్టింటిపై ఉన్న మమకారంతో భర్త మాటలు తోసిపుచ్చింది. అంటే భార్యాభర్తల మధ్య కలతలు ఆ ఆది దంపతులకే తప్పలేదు. అయితే ఇలాంటి మనస్థాపానికి సాధారణంగా స్త్రీ యొక్క బలహీనతే కారణం అవుతుంది. భార్యాభర్తల మధ్య పోటీ మనస్తత్త్వం ఎప్పుడూ ఉండకూడదు. భర్తను అనుసరించడం భార్యకు ధర్మమని వేదాలు చెబుతున్నాయి. కష్టాలను భరించి భర్త పట్ల విశ్వాసపాత్రంగా నడచుకునే స్త్రీ పతివ్రతగా గుర్తింపు పొందుతుందని పేర్కొన్నాయి.

కానీ ప్రస్తుతకాలంలో భార్యాభర్తలు చిన్న చిన్న కారణాలతోనే విడిపోతున్నారు. ఒకరి బలహీనతలను మరొకరు భూతద్దంలో చూడడం పరిపాటి మారింది. ఎన్నోసార్లు ఇద్దరి మధ్య అపార్థాలు చోటుచేసుకోవచ్చు. అంతమాత్రాన విడిపోదామనే ఆలోచనతో ముందుకు వెళ్లరాదు. అలాచేస్తే సహజ స్వభావానికి విరుద్ధంగా మూర్ఖత్వంతో కూడుకున్న మొండితనమే అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.