యాప్నగరం

శివుడి మూడో కన్ను.. ప్రళయానికే కాదు, జ్ఞానోదయానికీ చిహ్నమే

పరమశివుడి మూడోకన్ను ప్రళయానికి విధ్వంసానికే కాదు.. జ్ఞానోదయానికి, చైతన్యానికి సూచిక. ఇది ప్రాపంచీక కోరికలను దూరం చేసే సాధనం.

TNN 12 Feb 2018, 2:15 pm
పరమశివుణ్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తే చాలు.. కోరిన కోరికలు తీరుస్తాడు. తను ఇబ్బందులు ఎదుర్కొంటానని తెలిసినా దానవుల అసంబద్ధమైన కోరికలను తీర్చిన భోలా శంకరుడాయన. గరళాన్ని కంఠంలో ఉంచుకొని నీల కంఠుడయ్యాడు. కానీ అదే శివుడికి కోపం వస్తే విలయమే. అందుకే ఆ పరమేశ్వరుణ్ని ప్రళయకారుడిగా భావిస్తారు. మహాశివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిస్తే వినాశనం తప్పదని నమ్ముతారు. శివుడు ఆగ్రహించి మూడో కన్ను తెరిస్తే.. ఆ కోపాగ్నికి లోకం భస్మం అవుతుందని పురాణాలు చెబుతున్నాయి.
Samayam Telugu why shivas third eye is not just a symbol of destruction but also of wisdom and knowledge
శివుడి మూడో కన్ను.. ప్రళయానికే కాదు, జ్ఞానోదయానికీ చిహ్నమే


శివుణ్ని ముక్కంటిగా పిలుస్తారు. కుడి కన్ను సూర్యుడికి, ఎడమ కన్ను చంద్రుడికి ప్రతీకలైతే.. మూడో కన్ను అగ్నికి చిహ్నం. మూడో కన్ను విధ్వంసానికే కాదు.. ఆధ్యాత్మిక జ్ఞానానికి, వివేకానికి కూడా చిహ్నమే. రెండు కళ్ల ద్వారా చూడలేని దాన్ని మూడో కన్ను ద్వారా పరమ శివుడు చూస్తాడని భావిస్తారు. మూడో కన్ను తెరిస్తే దుష్ట శక్తులు, అజ్ఞానం నాశనం అవుతాయని నమ్ముతారు. మూడో కన్నును చెడు, దుష్ట శక్తుల అంతానికి సూచికగా భావించొచ్చు.

మూడో కన్ను చైతన్యానికి ప్రతీక అని బౌద్ధం చెబుతోంది. మూడో కన్ను ద్వారా ఏకాగ్రత పెంపొందించుకోవాలని, అంతర్గతంగా మనల్ని మనం ఆవిష్కరించుకోవాలని బౌద్ధ గురువులు చెబుతారు. జ్ఞానోదయం పొందడానికి ఇది ఉపకరిస్తుందని బౌద్ధం తెలియజేస్తోంది.


ఆధ్యాత్మిక బోధనల ప్రకారం అజ్ఞానాన్ని తరిమి వేయడం ద్వారా మనందరికీ మూడో కన్ను తెరిచే శక్తి ఉంది. తద్వారా జ్ఞానోదయం పొందొచ్చు. మూడో కన్నునే జ్ఞానాక్షువు అంటారు.

చాలా మంది ప్రాపంచిక కోరికలను తిరస్కరించే సాధనంగా మూడో కన్నును భావిస్తారు. ధ్యానంలో భాగంగా మూడో కన్నుపై ధ్యాస పెట్టాలని ఆధ్యాత్మిక గురువులు తమ శిష్యువులకు చెబుతారు. ఇలా చేయడం వల్ల అత్యున్నత ఏకాగ్రత, జ్ఞానోదయం పొందడం సాధ్యం అవుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.