యాప్నగరం

ఆ కాలంలో లక్ష ఏళ్లు బతికేవారట!

అష్టాదశ పురాణాల ప్రకారం యుగాలు నాలుగు. వాటిలో మొదటిది సత్య లేదా కృత‌యుగం, రెండోది త్రేతాయుగం, మూడోది ద్యాపరయుగం, నాల్గోది కలియగం. ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం.

TNN 6 Apr 2017, 11:50 am
అష్టాదశ పురాణాల ప్రకారం యుగాలు నాలుగు. వాటిలో మొదటిది సత్య లేదా కృత‌యుగం, రెండోది త్రేతాయుగం, మూడోది ద్యాపరయుగం, నాల్గోది కలియగం. ప్రస్తుతం మనం ఉన్నది కలియుగం. సత్యయుగాన్ని దేవతలు అధిపతులుగా పాలించారని అందువల్ల నేరాలు, హత్యలు, దోపిడీలు, దొంగతనాలకు తావులేదని అంటారు. ఆ కాలం నాటి ప్రజలు చర్యలు ఆదర్శవంతంగా నిలిచాయి కాబట్టి దీన్ని స్వర్ణయుగంగా పేర్కొన్నారు. పురణాల ప్రకారం సత్యయుగం 17,28,000 ఏళ్లు సాగింది.
Samayam Telugu why were there no poor people or any crime in satyug
ఆ కాలంలో లక్ష ఏళ్లు బతికేవారట!


ఈ యుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిచింది. ధర్మదేవతకు చిహ్నంగా ఆవును పేర్కొన్నారు. ఎందుకంటే ఆవు సాధు జంతువు. ప్రజలు తమ నైతిక నియమాలను తూ.చ. తప్పకుండా పాంటించారు. త్రేతా యుగంలో ధర్మం మూడు పాదాలు, ద్వాపర యుగంలో రెండు పాదాలపై నడిచింది. ప్రస్తుతం కలియుగంలో కేవలం ఒక పాదంపైనే ధర్మం నిలబడింది.

సత్యయుగంలో మానవుని ఆయుష్షు లక్ష ఏళ్లు. అలాగే ప్రజలకు స్వీయ పరిపూర్ణత మహావిష్ణువును ధ్యానించడం ద్వారా లభించింది. సోదరుడు, సోదరి, భార్యభర్తలు అనే సంబంధాలు సమాజంలో అభివృద్ధి చెందకపోయినా తమ బాహ్య భావాలపై నియంత్రణ కలిగి ఉండేవారు. పేద, ధనిక అనే తారతమ్యాలు లేకపోవడంతో నేరాలు కూడా జరగడానికి ఆస్కారం లేదు.

మహాభారతం ప్రకారం సత్యయుగంలో పేదలు, ధనవంతులు అనే వివక్షత లేదు. అలాగే శ్రామికలు అవసరంగానీ, రోగాలుగానీ లేవు. తమ శక్తి ద్వారా అవసరమైన వాటిని పొందేవారు. వ్యక్తులు ధ్యానం వల్ల పొందిన శక్తికి తమ ఆలోచనల ద్వారా నిజమైన రూపాన్ని ఇచ్చేవారు.

శ్రీమద్భాగవతంలోని పన్నెండో స్కంధం మూడో అధ్యాయం 19 వ భాగంలో సత్యయుగం ప్రజలు స్వీయ సంతృప్తితోనూ, దయతోనూ, స్నేహపూర్వకంగా, శాంతియుతంగా, తెలివిగా వ్యవహరించి మిక్కిలి ఓర్పు కలిగి ఉన్నారని పేర్కొన్నారు. అన్ని అంశాలను సమానంగా స్వీకరించి ఎల్లప్పుడూ ఆధ్మాతిక పరిపూర్ణతతో జాగురూకులై ఉండేవారు.

కలియుగంలో మత నియమాలు 1/4 వంతు మాత్రమే మిగిలి ఉంటాయని భాగవతంలోని పన్నెండో స్కంధం మూడో అధ్యాయం 24 వ భాగంలో తెలియజేశారు. ఈ యుగం చివరి ఘడియల్లో నిరంతరం నేరాలు, పేదరికం, వ్యాధులతోనే క్షీణిస్తుంది. చివరికి ఒక గ్రంథం మాత్రం మార్గాన్ని సుగమం చేస్తుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.