యాప్నగరం

మానస సరోవర యాత్ర.. సీఎం బంపర్ ఆఫర్!

పరమశివుడు కొలువై ఉన్న మానస సరోవరాన్ని చూసి వచ్చేందుకు ఉవిళ్లూరుతున్న వారికి యూపీ సీఎం బంపరాఫర్ ఇచ్చారు.

TNN 26 Mar 2017, 2:11 pm
ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి తనదైన శైలి నిర్ణయాలతో ముందుకెళ్తోన్న యోగి ఆదిత్యనాథ్ మరోసారి తన మార్కును చాటారు. కైలాస మానస సరోవర యాత్ర చేపట్టనున్న యాత్రికులకు ఇస్తోన్న ఆర్థిక సాయాన్ని రూ. 1 లక్షకు పెంచారు. ఇప్పటి వరకూ రూ. 50 వేలు మాత్రమే ఇస్తుండగా.. యోగి దాన్ని రెట్టింపు చేయడం గమనార్హం. యాత్రికుల సౌకర్యార్థం ఢిల్లీ సమీపంలో లేదా మరో రాష్ట్రంలో మానససరోవర్ భవన్‌ను రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనుందని ఆయన హామీ ఇచ్చారు.
Samayam Telugu yogi adityanath doubles financial grant for pilgrims of kailash mansarovar
మానస సరోవర యాత్ర.. సీఎం బంపర్ ఆఫర్!


ఇంతకు ముందు కైలస సరోవర యాత్రికులకు రూ. 25 వేలు మాత్రమే ఇచ్చేవారు. అఖిలేష్ ప్రభుత్వం దీన్ని రూ. 50 వేలకు పెంచగా.. ఇప్పుడు దాన్ని యోగి మరింతగా పెంచేశారు. పాస్‌పోర్ట్ కాపీని లేదా స్థిర నివాస సర్టిఫికెట్‌ను చూపించిన వారికి ఈ గ్రాంట్‌ను అందిస్తారు.

మానస సరోవర యాత్రకు వెళ్లేందుకు ఒక్కో యాత్రికుడికి సగటున రూ. 2.5 లక్షలు ఖర్చు అవుతుండటంతో చాలా మంది దాన్ని భరించే స్థితిలో లేరు. దీంతో యూపీ ప్రభుత్వం వారికి సబ్సిడీ కల్పిస్తోంది. వయసు, ఆరోగ్యం తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఎవరిని యాత్రకు పంపాలనే విషయాన్ని కేంద్రం నిర్ణయిస్తుంది. మానస సరోవరం ప్రాంతాన్ని పరమశివుడు కొలువుండే ప్రదేశంగా హిందువులు భావిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా ఆ ప్రాంతాన్ని సందర్శించాలని భావిస్తుంటారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.