యాప్నగరం

Shani Dev Puja ఏలినాటి శని దోషం పోవాలంటే ఈ పరిహారాలు పాటించండి...

Shani Dev Puja on Saturday శని దేవుని అనుగ్రహం పొందాలంటే ఏం చేయాలి... శనీశ్వరుడిని ఎలా పూజించాలి.. ఏమి చేస్తే శని దేవుడు సంతోషిస్తాడు.. భక్తులకు వరాలను అందిస్తాడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 9 Mar 2024, 1:11 am
Shani Dev Puja on Saturday హిందూ మత విశ్వాసాల ప్రకారం శని దేవుడిని న్యాయానికి, కర్మలకు అధిపతిగా భావిస్తారు. ఎవరి కర్మలకు ఎలాంటి ఫలాలు పొందాలో శని దేవుడే నిర్ణయిస్తాడు. ఈ నేపథ్యంలోనే ఎవరి జాతకంలో శని స్థానం బలహీనంగా ఉంటుందో వారు కష్టాల సుడిగుండంలో చిక్కుకున్నట్టే.. శని ప్రభావం ఉన్న వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నిరాశే ఎదురవుతూ ఉంటుంది. అయితే శని దోషం నుండి తప్పించుకోవడానికి కొన్ని పరిహారాలను పాటించాలి.. అలా చేయడం వల్ల శని దేవుడిని ప్రసన్నం చేసుకోవచ్చని పండితులు చెబుతున్నారు. అంతేకాదు శని దేవుని ఆశీస్సులు ఉంటే అనేక సమస్యల నుండి ఉపశమనం కలుగుతుందని చెబుతారు. ఈ సందర్భంగా శని దేవుని ఎలా పూజించాలి.. ఏమి చేస్తే శని దేవుడు సంతోషిస్తాడు.. భక్తులకు వరాలను అందిస్తాడనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Shani puja on saturday

ఆంజనేయుడిని ఆరాధించాలి..
హిందూ మత గ్రంథాల ప్రకారం, శనివారం రోజున సూర్యాస్తమయం తర్వాత ఆంజనేయుడిని ఆరాధించాలి. హనుమంతుడికి పూజ చేసేటప్పుడు పచ్చిమిర్చిని సమర్పించాలి. అలాగే నల్ల నువ్వుల నూనెతో దీపారాధన చేయాలి. అనంతరం హారతి ఇవ్వాలి. నీలం రంగులో పువ్వులను సమర్పించడం వల్ల శుభ ఫలితాలొస్తాయి.

Chanakya Niti చాణక్యుని ప్రకారం, ఈ అలవాట్లను అలవర్చుకుంటే శత్రువులను సైతం మిత్రులుగా మార్చుకోవచ్చు..!

శని యంత్రం..
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి శనివారం రోజున శని యంత్రం స్థాపించి, దాన్ని ఒక క్రమ పద్ధతిలో పూజించాలి. ఆ తర్వాత ప్రతిరోజూ ఆవాల నూనెతో దీపం వెలిగించాలి. నీలం లేదా నలుపు రంగు పువ్వులను సమర్పించాలి. ఇలా చేయడం వల్ల శని దేవుడు సంతోషిస్తాడు. మీకు ఆశీర్వదిస్తాడు.
శని దేవుడికి నైవేద్యంగా..
శనివారం రోజున మూడు కుండలలో ఒకటిన్నర కిలోల నల్ల శనగలను విడివిడిగా నానబెట్టాలి. అనంతరం వాటిని బాగా కడిగి ఆవాల నూనెలో బాగా వేయించి, శనిదేవుడికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే నల్ల బెల్లం సమర్పించాలి. పూజ పూర్తయిన తర్వాత పావు కిలోల పప్పును గేదెకు తినిపించాలి. ఇంకో పావు కిలో కుష్టు రోగులకు తినిపించాలి. మూడో పావును ఎవ్వరూ లేని ప్రదేశంలో మీ ఇంటి నుండి దూరంగా విసిరేయాలి.
శని దోషం నుంచి విముక్తి కోసం..
శనివారం సాయంత్రం రోజున మర్రిచెట్టు కింద ఆవాల నూనెతో దీపం వెలిగించి, ధూపం సమర్పించడం వల్ల శని దేవుని ఆశీస్సులు పొందొచ్చు. నల్లని ఆవుకు లడ్డూలు తినిపించి, దాని చుట్టూ తిరిగితే మీకు శని దోషం నుండి విముక్తి లభించే అవకాశం ఎక్కువగా ఉంటుంది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు. పై సమాచారాన్ని ‘‘సమయం తెలుగు’’ దృవీకరించడం లేదు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.