యాప్నగరం

Pitru Paksha Indira Ekadashi 2022 పితృపక్ష ఏకాదశి రోజున సాయంత్రం వేళ ఈ పనులు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి...!

Pitru Paksha Indira Ekadashi 2022 పితృపక్ష ఏకాదశి రోజున కొన్ని పనులు చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి.. మీకు ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇందిరా ఏకాదశి రోజున పాటించాల్సిన పరిహారాలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 21 Sep 2022, 11:33 am
Pitru Paksha Indira Ekadashi 2022 హిందూ పంచాంగం ప్రకారం ప్రతి నెలా రెండు ఏకాదశులు వస్తాయి. ఒకటి శుక్ల పక్షంలో వస్తే.. మరొకటి క్రిష్ణ పక్షంలో వస్తుంది. ఈ నేపథ్యంలో భాద్రపద మాసంలో సెప్టెంబర్ 21వ తేదీన బుధవారం నాడు క్రిష్ణ పక్షంలో ఏకాదశి వచ్చింది. పితృపక్షాల సమయంలో వచ్చిన ఈ ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. దీన్నే ఇందిరా ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ పవిత్రమైన రోజున ఉపవాసం ఉండి పూర్వీకులకు తర్పణం, శ్రాద్ధం చేయడం వల్ల శ్రీ మహా విష్ణువు అనుగ్రహం పొందడమే కాకుండా, పితృ, పూర్వీకుల దోషాల నుండి విముక్తి లభిస్తుందని గ్రంథాలలో పేర్కొనబడింది. అంతేకాదు పితృపక్ష ఏకాదశి రోజున కొన్ని పనులు చేయడం వల్ల మీ ఆర్థిక సమస్యలన్నీ తొలగిపోయి.. మీకు ఆనందం, శ్రేయస్సు పెరుగుతుందని పండితులు చెబుతున్నారు. ఈ సందర్భంగా ఇందిరా ఏకాదశి రోజున పాటించాల్సిన పరిహారాలేంటనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu pitru paksha indira ekadashi 2022 do these things on indira ekadashi for happy and prosperity in telugu
Pitru Paksha Indira Ekadashi 2022 పితృపక్ష ఏకాదశి రోజున సాయంత్రం వేళ ఈ పనులు చేస్తే దోషాలన్నీ తొలగిపోతాయి...!


​పూర్వీకుల ఆత్మ శాంతి కోసం..

ఇందిరా ఏకాదశి రోజున ఒక బ్రాహ్మణుడిని భోజనానికి ఇంటికి ఆహ్వానించాలి. అంతకంటే ముందు రావి చెట్టు కింద ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించి, పూర్వీకుల ఆత్మ శాంతి కోసం ప్రార్థించాలి. అనంతరం పూర్వీకులను స్మరించుకుంటూ విష్ణు సహస్రనామం పారాయణం చేయాలి. ఇలా చేయడం వల్ల మీకు సంతోషం, శ్రేయస్సు పొందడానికి పూర్వీకులు, విష్ణుమూర్తి నుంచి ఆశీస్సులు లభిస్తాయి.

Navratri 2022 నవరాత్రుల వేళ ఈ పనులు చేస్తే.. అపారమైన సంపద మీ సొంతమవ్వడం ఖాయం...!

పూర్వీకుల ఆత్మకు మోక్షం కోసం..

పితృ పక్ష ఏకాదశి రోజున ఉపవాసం ఉండాలి. అలాగే పూర్వీకుల పేరుతో దానధర్మాలు చేయడం వల్ల, మరణం తర్వాత యమదూతకు భయపడకుండా మీ ఆత్మ ప్రయాణం సులభతరం అవుతుంది. దీంతో పాటుగా మీ పూర్వీకుల ఆత్మలకు మోక్షం లభిస్తుంది. ఈ ఇందిరా ఏకాదశి నాడు కచ్చితంగా ఫలితం లభిస్తుందని, అందుకే దీన్ని శుభప్రదంగా భావిస్తారు.

శ్రీ మహావిష్ణు మంత్రాలను..

ఇందిరా ఏకాదశి రోజున సూర్యోదయం, సూర్యాస్తమయం సమయంలో తులసి చెట్టు ముందు ఐదు నెయ్యి దీపాలు వెలిగించి 11 ప్రదక్షిణలు చేస్తూ ‘ఓం నమో భగవతే వాసుదేవాయ’ అనే మంత్రాన్ని జపించాలి. ఇలా చేయడం వల్ల పూర్వ జన్మలో మీరు చేసిన పాపాలన్నీ తొలగిపోయి పూర్వీకుల నుండి పుణ్యఫలం పొంది ఇంట్లో సుఖశాంతులు లభిస్తాయి.

కష్టాల నుంచి ఉపశమనం..!

పితృ పక్ష ఏకాదశి రోజున ఐదు తమలపాకులపై ‘శ్రీ’ అని రాసి విష్ణుమూర్తికి సమర్పించాలి. అనంతరం ఆకులను ఎర్రని వస్త్రంలో కట్టి వాటిని భద్రంగా ఏదైనా అల్మారా వంటి ప్రదేశంలో ఉంచాలి. ఇలా చేయడం వల్ల మీరు చేసే వ్యాపారంలో పురోగతి లభిస్తుంది. ఉద్యోగులకు పదోన్నతి గురించి శుభవార్తలు వినిపిస్తాయి. మీరు ఇప్పటివరకు పడిన కష్టాల నుండి ఉపశమనం లభిస్తుంది.

పూర్వీకులను స్మరించుకుంటూ..

ఇందిరా ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును స్మరించుకుంటూ మీ ఇంటి ప్రధాన ద్వారం(Main Gate) దగ్గర వచ్చిన ఆవుకు పచ్చి గడ్డిని తినిపించాలి. ఇలా చేయడం వల్ల మీకు ఎంతో పుణ్యం లభిస్తుంది. అంతేకాదు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, మీ జాతకంలో బుధుని స్థానం కూడా బలపడుతుంది.

​ఉపవాస పద్ధతులు..

ఇందిరా ఏకాదశి రోజున ఉపవాసం ఉండే వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడే మీకు ఏకాదశి ఫలాలు లభిస్తాయి. మీరు ఏ చిన్న తప్పు చేసినా దాని వల్ల మీకు తీవ్రమైన ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి. ఈరోజున ఉపవాసం ఉండే వారు కేవలం శుభ సమయంలో మాత్రమే ఉపవాసాన్ని విరమించాలి. అంటే మరుసటి రోజు అయిన ద్వాదశి నాడు మాత్రమే ఉపవాసాన్ని విరమించాలని శాస్త్రాలలో వివరించబడింది.

గమనిక : ఇక్కడ అందించిన సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Read Latest Religion News

రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.