యాప్నగరం

Friday lakshmi pooja ఈ శుక్రవారం అమావాస్య వేళ లక్ష్మీపూజలో ఈ పొరపాట్లు చేయకండి...

Friday maa lakshmi pooja in Telugu పురాణాల ప్రకారం, లక్ష్మీదేవిని సంపదకు, ఐశ్వర్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావిస్తారు. అందుకే శుక్రవారం సాయంత్రం అమ్మవారిని ప్రత్యేకంగా పూజిస్తారు.

Authored byఎస్.వెంకటేష్ | Samayam Telugu 8 Feb 2024, 6:54 pm
Friday maa lakshmi pooja తెలుగు పంచాంగం ప్రకారం, వారంలోని ఏడు రోజులలో ఒక్కో రోజుకు ఒక్కో ప్రత్యేకత ఉంది. అయితే పుష్య మాసంలో వచ్చే శుక్రవారానికి మరింత ప్రాధాన్యత ఉంది. శుక్రవారం లక్ష్మీదేవికి అంకితం ఇవ్వబడింది. ఈ పవిత్రమైన పర్వదినాన్ని మహిళలకు సంబంధించిన వారంగా పెద్దలు చెబుతారు. సంపదకు, ఐశ్వర్యం, శ్రేయస్సుకు ప్రతీకగా భావించే లక్ష్మీదేవిని శుక్రవారం సాయంత్రం ప్రత్యేకంగా పూజిస్తారు. ఈరోజున లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో ఆరాధించడం వల్ల ఆ మహాలక్ష్మీ అనుగ్రహం లభించడమే కాదు.. తను ఎల్లప్పుడూ మన ఇంట్లోనే నివాసం ఉంటుందని.. ఈ కారణంగా మనం సంతోషంగా ఉండొచ్చని పండితులు చెబుతారు. అయితే లక్ష్మీదేవి పూజలు చేసేటప్పుడు మనకు తెలీకుండానే కొన్ని పొరపాట్లు చేస్తుంటాం.. ఈ సందర్భంగా శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ఎలా పూజించాలి.. ఏయే పనులు చేయాలి.. ఏయే పనులు చేయకూడదనే ఆసక్తికరమైన విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం...
Samayam Telugu Lakshmi puja

లక్ష్మీదేవి సంతోషిస్తుంది..
శుక్రవారం రోజున ఇంటిని మొత్తం శుభ్రం చేసుకోవాలి. ఇంటిని అంతా క్లీన్ చేశాక, ఇంట్లో ప్రతి మూలలోనూ గంగాజలం చల్లాలి. ఇలా శుభ్రంగా ఉన్న ఇంట్లో లక్ష్మీదేవి ఎక్కువగా నివాసం ఉంటుందని చాలా మంది నమ్ముతారు. అంతేకాదు ఆ ఇంటి సంక్షేమాన్ని, ఆనందాన్ని శ్రేయస్సును తెస్తుంది.
Vivah Muhurat in 2024 ఈ ఏడాదిలో మూడు ముళ్లు.. భాజ భజంత్రీల వేడుకకు శుభ ముహుర్తాలివే..
తులసి చెట్టుకు పూజ..
లక్ష్మీదేవి ఆశీస్సులు ఉన్నవారికి ఆర్థిక సమస్యలనేవే రావు. అయితే అమ్మవారి అనుగ్రహం లభించాలంటే శుక్రవారం రోజున ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేయాలి. ముందుగా మహిళలు సూర్యోదయం కంటే ముందే నిద్ర లేచి తల స్నానం చేయాలి. అనంతరం ఉతికిన బట్టలను ధరించి తులసి చెట్టుకు పూజ చేయాలి. అనంతరం పూజా మందిరంలో ధూప దీప నైవేద్యాలను సమర్పించాలి. పసుపు, కుంకుమతో గడపను అలంకరించాలి. ఇలాంటి ఇంట్లోకి లక్ష్మీదేవి ఇష్టంతో ప్రవేశిస్తుందని పురాణాలలో వివరించబడింది. వీలైతే ఉదయం లేదా సాయంత్రం అమ్మవారి ఆలయానికి వెళ్లి దర్శనం చేసుకోవాలి. దేవాలయం ప్రాంగణంలో కొన్ని నిమిషాల పాటు కూర్చోవాలి.
ఈ పనులు చేయొద్దు..
పవిత్రమైన శుక్రవారం రోజున పగలు, సంధ్యా వేళలో అంటే సాయంకాలం సమయంలో ఎవ్వరూ నిద్రపోకూడదు. ఎందుకంటే ఈ సమయంలో దేవతలు చురుగ్గా ఉంటారు. ఒకవేళ మీరు నిద్రపోతే మీ ఇంట్లోకి ప్రతికూల శక్తులు ప్రవేశించే అవకాశం ఉంది. కాబట్టి ఈ సమయంలో ఎవ్వరూ నిద్రపోకండి. అదే విధంగా ఈరోజున కేవలం శాకాహారం మాత్రమే తీసుకోవాలి. మద్యం, మాంసం వంటివి తినకూడదు.

గమనిక : ఇక్కడ అందించిన భక్తి సమాచారం, పరిహారాలన్నీ మత విశ్వాసాలపై ఆధారపడి ఉన్నాయి. ఇవి కేవలం ఊహాల ఆధారంగా ఇవ్వబడింది. దీనికి సంబంధించి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవు. ఈ సమాచారాన్ని మీరు పరిగణనలోకి తీసుకునేందుకు సంబంధిత నిపుణులను సంప్రదించి పూర్తి వివరాలను తెలుసుకోగలరు.

Read Latest Religion News and Telugu News
రచయిత గురించి
ఎస్.వెంకటేష్
ఎస్.వెంకటేష్ సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ప్రతిరోజూ ఆస్ట్రాలజీ, ఆధ్యాత్మిక రంగాలకు సంబంధించి కొత్త విషయాలను, మిస్టరీలను, ప్రత్యేకమైన సమాచారాన్ని అందిస్తారు. తనకు జర్నలిజంలో 8 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇప్పటివరకు ప్రముఖ మీడియా సంస్థల్లో వార్తలు, క్రీడలు, ఫీచర్స్, లైఫ్‌స్టైల్(జీవన శైలి)కు సంబంధించిన సమాచారాన్ని అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.