యాప్నగరం

శబరిమల: మిలియన్ ఉమెన్ వాల్‌కు కేరళ సీఎం పిలుపు!

శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు మహిళలను భక్తులు శనివారం అడ్డుకున్నారు. సన్నిధానానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో మహిళలను భక్తులు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగారు.

Samayam Telugu 2 Dec 2018, 3:41 pm
శబరిమల అయ్యప్ప ఆలయానికి వెళ్లేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు మహిళలను భక్తులు శనివారం అడ్డుకున్నారు. సన్నిధానానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో మహిళలను భక్తులు అడ్డుకోవడంతో వారు వెనుదిరిగారు. వీరిలో ఓ మహిళ వయసు 42 ఏళ్లు కాగా, మరొకరు 20 ఏళ్ల యువతి. ఆలయానికి కిలోమీటరు దూరంలోనే వీరిని అడ్డుకుని వెనక్కు పంపించారు. అయితే, ఈ మహిళలు శబరిమలకు వస్తున్నట్టు తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని పోలీసులు తెలిపారు. భక్తుల ఆందోళన తర్వాతే తమకు విషయం తెలిసిందని పేర్కొన్నారు. ఈ మహిళలను పోలీస్ స్టేషన్‌కు తరలించి, వెనక్కు పంపామని వెల్లడించారు.
Samayam Telugu sabari2


కాగా, సుప్రీంకోర్టు తీర్పును అమలుచేయడానికి తాము ప్రయత్నిస్తుంటే సంఘ్‌ పరివార్‌తో సహా కాంగ్రెస్ సమస్యలను సృష్టిస్తున్నాయని కేరళ సీఎం పినరయి విజయన్ వ్యాఖ్యానించారు. మహిళలను శబరిమలలో ప్రవేశించకుండా అడ్డుకుంటున్నందుకు నిరసనగా ఉత్తరాన కాసర్‌గఢ్ నుంచి రాజధాని తిరువనంతపురం వరకు ‘ఉమెన్ వాల్’కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు తెలిపారు. దీనిపై క్యాబినెట్‌లో కీలక మంత్రి థామస్ ఇసాక్ ఓ ట్వీట్ చేశారు. ‘రాష్ట్రంలో మధ్యయుగం నాటి పోకడలు, సంస్కృతిలోకి మారకుండా నివారించడానికి గ్రేట్ వాల్ ఆఫ్ కేరళ పేరుతో జనవరి 1న నిర్వహించే మానవహారానికి వేలాది మంది మహిళలు తరలివచ్చి తమ మద్దతు తెలియజేయాలని’ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

మరోవైపు, సుప్రీంకోర్టు తీర్పును అమలు కోసం మానవహారం నిర్వహిస్తామని కేరళ ప్రభుత్వం ప్రకటనతో అప్రమత్తమైన బీజేపీ దీన్ని భగ్నం చేయాలనే సంకల్పంతో ఉంది. శబరిమల వివాదంపై నలుగురు సభ్యులతో ఏర్పాటుచేసిన బృందం భక్తులు, బీజేపీ కార్యకర్తలను కలిని తన నివేదికను అధిష్ఠానానికి అందజేయనుంది. సభ్యులు సరోజ్ పాండే, వినోధ్ సోంకర్, ప్రహ్లాద్ జోషి, నలిన్ కుమార్ కాటీల్‌తో కమిటీని ఏర్పాటుచేసినట్టు బీజేపీ ప్రకటించింది. ఈ బృందం పందళ రాజ కుటుంబాన్ని సైతం కలవనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.