యాప్నగరం

శబరిమలలో అడుగుపెట్టి గెలిచా: విలేకరి కవిత

మహిళలు శబరిమల ఆలయంలోకి ప్రవేశించకుండా వెనుదిరగడంతో పరిస్థితులు శాంతించాయి. ఆలయ ప్రవేశానికి ప్రయత్నించిన మహిళల్లో ఒకరైన కవిత.. మరోసారి తప్పకుండా శబరిమల వెళ్తానని ఈ సందర్భంగా తెలిపారు.

Samayam Telugu 19 Oct 2018, 5:14 pm
బరిమల సాంప్రదాయాలను సవాల్ చేస్తూ.. ఆలయ ప్రవేశానికి సిద్ధమైన హైదరాబాద్ పాత్రికేయురాలు కవిత భక్తుల ఆందోళనలతో వెనుతిరగక తప్పలేదు. నిలక్కల్ బేస్ క్యాంప్‌తో కలిసి శబరిమల కొండపైకి వెళ్లిన కవిత జక్కల్, మరో సామాజిక కార్యకర్త శుక్రవారం దాదాపు సన్నిధానం దాటి దాదాపు శబరిమల ఆలయాన్ని సమీపించారు.
Samayam Telugu Untitled123


ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న 18 మెట్ల వద్దకు చేరగానే మానవహారంగా ఏర్పడిన భక్తులంతా వారిని అడ్డుకున్నారు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నారులు భారీ సంఖ్యలో ఆందోళనకు దిగారు. ఆలయ తలుపులు మూసివేస్తామని ప్రధాన పూజారి హెచ్చరించారు. ఈ నేపథ్యంలో బలవంతంగా ఆలయ ప్రవేశం చేయలేమని కేరళ పోలీసులు వెల్లడించడంతో ముగ్గురు మహిళలు వెనుతిరగక తప్పలేదు.

ఈ సందర్భంగా పాత్రికేయురాలు కవిత మాట్లాడుతూ.. అయ్యప్ప కొండపైకి రావడం చాలా సంతోషంగా, గర్వంగా ఉందని తెలిపారు. ఈ రోజు ఎంతో ప్రమాదకర పరిస్థితి ఎదుర్కొన్నానని, ఆలయానికి 100 మీటర్ల దూరంలోనే ఆగిపోయామన్నారు. వృద్ధులు, చిన్న పిల్లలు అడ్డుకోవడం వల్ల వెనక్కి వచ్చేశానన్నారు. కొండపైకి వెళ్లి విజయం సాధించానని తాను గర్వంగా చెప్పగలనని తెలిపారు. మరికొద్ది రోజుల్లో మళ్లీ శబరిమలకు వస్తానన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.