యాప్నగరం

అయ్యప్ప దీక్ష... ఆరోగ్య ప్రయోజనాలు!

శబరిగిరుల్లో కొలువున్న హరిహరసుతుడు అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు మాలను ధరించి, నియమ నిష్టలతో 41 రోజులు దీక్ష చేస్తారు.

TNN 17 Nov 2017, 5:37 pm
శబరిగిరుల్లో కొలువున్న హరిహరసుతుడు అయ్యప్పను దర్శించుకోవడానికి భక్తులు మాలను ధరించి, నియమ నిష్టలతో 41 రోజులు దీక్ష చేస్తారు. అయ్యప్ప దీక్ష చాలా కఠినమైంది... ఎంతో భక్తి భావంతో కూడుకున్నది. నలభై రోజుల పాటు చేసే దీక్షలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి. నేలమీద పడుకోవడం, చన్నీటి స్నానం, ఏకభుక్తం, పాదరక్షలు ధరించకపోవడం లాంటి కఠిన నియమాలు పాటిస్తారు. ఈ నియమాల వల్ల ఎన్న ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
Samayam Telugu health benefits with ayyappa deeksha
అయ్యప్ప దీక్ష... ఆరోగ్య ప్రయోజనాలు!


దీక్షా కాలంలో నేలపైనే పవళించడం వల్ల వెన్నునొప్పి, కండర పటిష్టతకు దోహద పడుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగుపడుతుంది.

తెల్లవారు జామునే నిద్రలేవడం చైతన్యానికి ప్రతీక... తర్వాత చన్నీటితో స్నానం శరీరంలోని నాడీ వ్యవస్థను ఉత్తేజిపరుస్తుంది. అందుచేతనే ముఖంలో ప్రసన్నత తాండవిస్తుంది.

దీపారాధన ఆవరణ అంతా కాంతివంతమవుతుంది. ఆ సమయంలో శ్రద్ధగా పూజచేయడంతో మనసు తేలిక పడుతుంది.

సామూహికంగా కలిసి ఉండటంతో క్రమశిక్షణ పూర్తిగా అలవడుతుంది. ఇతర భక్తులతో ఇచ్చిపుచ్చుకునే స్వభావం మరింత పెరుగుతుంది.

రోజూ దుస్తులను తడిపి శుభ్రంచేసుకోవడం అలవడుతుంది. క్రమం తప్పకుండా స్వామి పూజలో పాల్గొవడం ద్వారా సంఘజీవనానికి బాటలు వేస్తుంది.

అధిక ప్రసంగాలు, వివాదాలకు దూరంగా ఉండటం వల్ల సమయం వృధా ఉండదు. ఆలోచన సామర్థ్యం మెరుగుపడుతుంది.

ఒక్కపూట భోజనం ద్వారా మితహారాన్ని ప్రోత్సహిస్తారు. అందులోనూ శాకాహారం మాత్రమే తీసుకోవడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. పొగ తాగడం, మద్యపానం వంటి దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఇంతటి అద్భుతమైన నియమాలు మరెక్కడా కానరావు.

అయ్యప్ప స్వామి దీక్షలో వ్యవధికి ఎంతో ప్రాధాన్యత ఉంది. మణిమాలను ధరించి దీక్ష ప్రారంభిస్తారు. నియమాలతో దీక్ష చేసి, ఇరుమడి కట్టుకుంటారు. అప్పటిదాకా పవిత్రమైన జీవనాన్ని, కఠిన నియమాలతో పాటిస్తారు. అసలు 40 రోజులపాటు దీక్షను ఎందుకు నిర్దేశించారు? ఈ వ్యవధిలో ఎన్ని పనులు చేయగలరు? దీని వెనుకున్న శాస్త్రీయతను పరిశీలిస్తే ఎన్నో విషయాలు బయటపడతాయి. అయ్యప్ప స్వామి దీక్షకు 40 రోజులు లెక్కచేస్తారు. దీనికి ప్రత్యేక కారణం ఉంది. సంవత్సరానికి 360 రోజులుంటే దాన్ని 9 చే భాగిస్తే 40 రోజులు వస్తాయి. దీన్ని మండల కాలంగా భావిస్తారు. మండల కాలంపాటు ఏదైనా దీక్ష చేస్తే అది మిగిలిన జీవితానికి ఆదర్శం. పొగతాగటం, మద్యం తీసుకోవడం లాంటి అలవాట్లకు 40 రోజులపాటు దూరంగా ఉంటే మిగతా సమయంలోనూ నిగ్రహంతో ఉండవచ్చు.
ఎలాంటి ఆర్భాటాలు, హంగులు లేకుండా సామాన్య జీవనం అలవడుతుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.