యాప్నగరం

ఆ ఆలయంలో ప్రవేశిస్తేనే స్త్రీకి సాధికారతా?: సునీత కృష్ణన్

ఆ ఒక్క ఆలయంలోకి ప్రవేశించడం ద్వారా స్త్రీ సాధికారత సాధిస్తుందా? అంటూ ప్రముఖ సామాజికవేత్త సునితా కృష్ణన్ వ్యాఖ్యలు.

Samayam Telugu 20 Oct 2018, 10:42 am
బరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. తాము తప్పకుండా ఆలయంలోకి ప్రవేశించి తీరుతామంటూ కొంతమంది స్త్రీవాదులు చేస్తున్న ప్రయత్నాలు భక్తులను ఆగ్రహానికి గురిచేస్తోంది. తమ విశ్వాసాలను కాలరాయద్దంటూ కేరళకు చెందిన మహిళలు సైతం వారిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
Samayam Telugu Untitled1231


హైదరాబాద్‌కు చెందిన సామాజికవేత్త, పద్మశ్రీ అవార్డు గ్రహీత సునితా కృష్ణన్ సైతం స్త్రీవాదుల ప్రయత్నా్న్ని వ్యతిరేకిస్తున్నారు. ‘‘ప్రపంచంలోని లక్షలాది ఆలయాల్లో మహిళలకు ప్రవేశం ఉంది. కానీ, ఆ ఒక్క ఆలయానికి మాత్రమే ప్రత్యేక ఆంక్షాలు ఉన్నాయి. అయితే, ఆ ఒక్క ఆలయంలోకి ప్రవేశిస్తేనే మహిళలు సాధికారత ఎలా సాధిస్తారు?’’ అని ట్వీట్ చేశారు.
ఇతర మతాలకు చెందిన మహిళలు సైతం అయ్యప్పను దర్శించుకోడానికి సిద్ధం కావడంపైనా ఆమె వరుస ట్వీట్లతో ప్రశ్నలు కురిపించారు. ‘‘వావ్, స్వామి అయప్ప. మీరు చాలా గ్రేట్. రెహనా ఫాతిమా అనే ముస్లిం, మేరీ స్వీటీ అనే క్రిస్టియన్ మీ భక్తులయ్యారు’’ అని ట్వీట్ చేశారు. ‘‘ముస్లిం మహిళ రెహనా ఫాతిమా పోలీసు బలగాల మధ్య అయప్ప దర్శనానికి వెళ్తోంది. ఇది విశ్వాసాలను పరిహాసం చేయడమా లేదా స్త్రీవాదులు అహంతో చేస్తున్న యుద్ధమా?’’ అని మరో ట్వీట్‌లో ప్రశ్నించారు.
ఆమె ట్వీట్లకు స్పందించిన కొందరు.. ముస్లిం మహిళలను మసీదుల్లోకి అనుమతి ఇవ్వరని, అటువంటిది అయప్ప ఆలయంలోకి ప్రవేశం ఎలా కోరుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవించి మహిళలను శబరిమలలోకి అనుమతించాలని మరికొందరు తెలుపుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.