యాప్నగరం

పిచ్ ‘డ్రై’ అందుకే రోహిత్ బ్యాటింగ్..?

రోహిత్ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే పిచ్ చూసిన తర్వాత రెండు జట్లు తొలుత

TNN 22 May 2017, 3:19 pm
ఐపీఎల్ పదో సీజన్‌లో టాస్ గెలిచి.. ముంబయి ఇండియన్స్ బ్యాటింగ్ ఎంచుకోవడం చాలా అరుదు. భీకర హిట్టర్లున్న ఆ జట్టుకి ఛేదనలో మెరుగైన రికార్డు ఉంది. కానీ.. ఉప్పల్ వేదికగా ఆదివారం జరుగుతున్న ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బ్యాటింగ్ ఎంచుకోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది.
Samayam Telugu rps vs mi final
పిచ్ ‘డ్రై’ అందుకే రోహిత్ బ్యాటింగ్..?


రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ స్లో అవుతుందంటూ టాస్ సమయంలో రోహిత్ శర్మ అభిప్రాయపడ్డాడు. క్రికెట్ విశ్లేషకుడు హర్షాభోగ్లే సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. ‘రోహిత్ నిర్ణయం నన్ను ఆశ్చర్యపరచలేదు. ఎందుకంటే పిచ్ చూసిన తర్వాత రెండు జట్లు తొలుత బ్యాటింగ్ చేయాలని ఆశించి ఉంటాయి. పిచ్ ‘డ్రై’గా ఉన్నప్పటికీ బోర్డుపై మెరుగైన స్కోరు ఉంచడం మంచిది. అదే మ్యాచ్‌ని గెలిపించగలదు’ అని భోగ్లే వివరించాడు. ఇదే వేదికపై మే 8న జరిగిన మ్యాచ్‌లో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబయి 7 వికెట్ల నష్టానికి 138 పరుగులు చేయగా.. 18.2 ఓవర్లలోనే హైదరాబాద్ ఆ లక్ష్యాన్ని ఛేదించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.