యాప్నగరం

ప్రామిస్ చేయించుకుని ఫొటోకి సచిన్ పర్మిషన్

సచిన్ తెందుల్కర్ కారులో వెళ్తూ సిగ్నల్ దగ్గర ఆగాడు. అతని పక్కన ఓ స్కూటర్‌పై

TNN 9 Apr 2017, 5:05 pm
భారత క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్‌కి ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలుసు. అతను క్రికెట్‌కి దూరమైనా.. అభిమానుల్లో మాత్రం ఈ దిగ్గజానికి ఉన్న ఆదరణ ఇసుమంతైనా తగ్గలేదు. ఇప్పటికీ అతను ఎక్కడ కనబడినా ఫొటోలు, ఆటోగ్రాఫ్‌లంటూ జనం ఎగబడిపోతుంటారు. తాజాగా సచిన్ తెందుల్కర్ కారులో వెళ్తూ సిగ్నల్ దగ్గర ఆగాడు. అతని పక్కన ఓ స్కూటర్‌పై వచ్చిన ఇద్దరు యువకులు సచిన్‌‌తో కలిసి సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించారు. అయితే వారు హెల్మ్‌ట్ లేకుండానే స్కూటర్‌పై ప్రయాణిస్తుండటంతో సున్నితంగా హెచ్చరించాడు. అనంతరం ఫొటోకి పోజు ఇచ్చి ఇక నుంచి తప్పకుండా హెల్మెట్ ధరించాలంటూ యువకులతో ప్రామిస్ చేయించుకున్నాడు. ఆ సమయంలోనే వారి పక్కనే బైక్‌పై వచ్చిన ఓ దంపతులకి కూడా సచిన్ ఇదే సూచన చేయడం విశేషం. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ప్రస్తుత ఐపీఎల్ సీజన్‌లో కూడా ముంబయి ఇండియన్స్ జట్టుకి సచిన్ మెంటార్‌గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.
Samayam Telugu sachin tendulkar pulls up law breaking bikers asks them to wear helmets
ప్రామిస్ చేయించుకుని ఫొటోకి సచిన్ పర్మిషన్



తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.