యాప్నగరం

విజయవాడ చిన్నారి శివశ్రీ కేసులో కొత్త ట్విస్ట్

‘నాన్నా! నన్ను బతికించు’ అంటూ సోషల్‌ మీడియాలో సెల్ఫీ వీడియో ఆప్‌ లోడ్‌ చేసి, మృతి చెందిన సాయి శివశ్రీ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే.

TNN 29 May 2017, 1:30 pm
‘నాన్నా! నన్ను బతికించు’ అంటూ సోషల్‌ మీడియాలో సెల్ఫీ వీడియో ఆప్‌ లోడ్‌ చేసి, మృతి చెందిన సాయి శివశ్రీ ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఆ వీడియోలో శివశ్రీ తన తండ్రిగా పేర్కొన్న మాదంశెట్టి శివకుమార్ ఈ ఘటనపై మీడియాకు సుదీర్ఘ ప్రకటన విడుదల చేశారు. అసలు శివశ్రీ తన కుమార్తె కాదని ఆయన పేర్కొన్నారు. అలాగే ఆమె తల్లి వెంకటేశ్వరమ్మ అలియాస్ సుమశ్రీ తన భార్య కాదని అన్నాడు.
Samayam Telugu 13 year old vijayawada girl begging dad for money to treat cancer
విజయవాడ చిన్నారి శివశ్రీ కేసులో కొత్త ట్విస్ట్


అంతేకాదు శివశ్రీ అనారోగ్య కారణంగా మరణించలేదని, సుమశ్రీతో కలిసి మరికొందరు ఆమెను హత్య చేశారని ఆరోపించారు. దీనికి సంబంధించిన సాక్ష్యాలు తన దగ్గర ఉన్నాయని శివకుమార్ తెలిపాడు. ఈ విషయంపై ఇప్పటికే మానవహక్కుల కమిషన్ ను ఆశ్రయించానని, త్వరలో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తానని ఆ ప్రకటనలో తెలియజేశారు. ప్రస్తుతం సుమశ్రీతో ఉంటున్న పోలిన కృష్ణకుమార్‌ అనే వ్యక్తికి ఆమె మూడో భార్య అని ఆయన అన్నారు. చిన్నారి శివశ్రీతో కలిసి సుమశ్రీ కొంతకాలం కిందట తన ఫ్లాట్‌‌లో అద్దెకు దిగిందని తెలిపారు.

అద్దెకు దిగిన కొన్ని రోజుల తర్వాత రూ.8 లక్షల విలువైన బంగారు ఆభరణాలను దొంగిలించి హైదరాబాద్‌ లోని కృష్ణకుమార్‌ దగ్గరకు వెళ్లిపోయిందని, అప్పట్లో దీనిపై పామర్రు పోలీసు స్టేషన్‌‌లో కూడా ఫిర్యాదు చేశానని తెలిపారు. కేవలం మానవతా దృక్పథంతోనే పాపను పెంచానని, శివశ్రీ వైద్యానికి సుమారుగా రూ.25 లక్షల ఖర్చు చేశానని ఆయన తెలియజేశాడు. సదుద్దేశంతో సాయం చేశాను తప్ప వారితో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పాడు.

టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమ అనుచరులు శివశ్రీ పేరిట ఉన్న ఫ్లాట్ ను ఆక్రమించారని, విక్రయించకుండా అడ్డుకుంటున్నారని శివశ్రీ, ఆమె తల్లి సుమశ్రీ ఆరోపణలపై కూడా ఆయన తన ప్రకటనలో ప్రస్తావించారు. గతంలో అమ్మాయిల అక్రమ రవాణా కేసులో పట్టుబడి, చంచల్‌ గూడ జైలులో శిక్ష అనుభవించి బయటకు వచ్చిన ఓ మహిళ ఆధ్వర్యంలో దుర్గాపురంలోని తన ఫ్లాట్‌‌లో అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. దీనిపై ఫ్లాట్ చుట్టుపక్కల వారు కంట్రోల్‌ రూమ్‌ కు పలుమార్లు ఫిర్యాదు చేశారని అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.