యాప్నగరం

​సైకిళ్లపై పెళ్లి కొడుకుల సవారీ

పెళ్లికొడుకులు, వారి బంధువులు వందలుగా కలిసి సైకిల్ తొక్కుకుంటూ మండపానికి వెళుతుంటే ఎలా ఉంటుంది?

TNN 4 Nov 2016, 5:33 pm
పెళ్లికొడుకులు, వారి బంధువులు వందలుగా కలిసి సైకిల్ తొక్కుకుంటూ మండపానికి వెళుతుంటే ఎలా ఉంటుంది? ఇలాంటి ఘటనే నవంబర్ 7న సూరత్‌లో కనిపించబోతోంది. సౌరాష్ట్ర పటేల్ సేవా సమాజ్ వాళ్లు ఆ రోజున 58వ సామూహిక వివాహ కార్యక్రమాన్ని నిర్వహించబోతున్నారు. 258 జంటలు ఆ రోజున పెళ్లి ద్వారా ఒక్కటవ్వబోతున్నాయి. కాగా నిర్వాహకులు ట్రాఫిక్ పైనా, కాలుష్యంపైనా, ఆరోగ్యం పైనా అవగాహన కల్పించేందుకు ఇలా వినూత్నంగా సైకిళ్లపై పెళ్లి కొడుకుల సవారీ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
Samayam Telugu 258 grooms will arrive on cycles for their marriage in surat
​సైకిళ్లపై పెళ్లి కొడుకుల సవారీ


పెళ్లి మండపానికి పెళ్లి కొడుకులు, తమ బంధుగణంతో కలిసి సైకిళ్లపై వస్తారు. ఉదయం 8.30కి సౌరాష్ట్ర భవన్ నుంచి వీరి సైకిల్ యాత్ర ప్రారంభమై కళ్యాణ మండపం వరకు సాగుతుంది.

పెళ్లిళ్ల నిర్వాహకుడు కంజి భలాలా మాట్లాడుతూ తాము పెళ్లి కొడుకులే కాకుండా... సామాన్య ప్రజలను కూడా సైకిల్ యాత్రలో భాగస్వాములు కావాల్సిందిగా కోరుతున్నామని చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.