యాప్నగరం

దారుణంగా భర్తను హత్యచేసి సూట్‌కేస్‌‌లో...

భర్తతో గొడవపడిన ఓ మహిళ అతడిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. తర్వాత అతడి మృతదేహాన్ని సూట్‌కేసులో దాచిపెట్టింది.

TNN 20 Mar 2017, 4:00 pm
భర్తతో గొడవపడిన ఓ మహిళ అతడిని అత్యంత కిరాతకంగా హత్య చేసింది. తర్వాత అతడి మృతదేహాన్ని సూట్‌కేసులో దాచిపెట్టింది. ఈ ఘటన పంజాబ్‌లోని మొహాలీలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మొహాలీకి చెందిన 40 ఏళ్ల ఎకమ్‌ సింగ్‌ ధిల్లాన్‌, అతడి భార్యకు మధ్య ఆదివారం గొడవ జరిగింది. దీంతో ఆయనను తన సోదరుడితో కలిసి భార్య హత్య చేసింది. హత్య తర్వాత మృతదేహాన్ని సూట్‌కేస్‌లో కుక్కి సమీపంలోని కాల్వలో పడేయడానికి ప్రయత్నించింది.
Samayam Telugu 40 yr old man murdered in mohali body found stuffed in suitcase
దారుణంగా భర్తను హత్యచేసి సూట్‌కేస్‌‌లో...


మృతదేహాం ఉన్న సూట్‌కేసును కారులోకి ఎక్కిస్తుండగా అటువైపుగా వెళుతోన్న ఓ ఆటోడ్రైవర్‌ అందులో నుంచి రక్తం కారుతుండటాన్ని గమనించాడు. దీంతో అతడు ఈ విషయం గురించి పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం ఆధారంగా రంగంలోకి దిగిన పోలీసులు అక్కడకు చేరుకుని సూట్‌కేసులో మృతదేహాన్ని గుర్తించారు. దిల్లాన్‌ భార్యను అరెస్టు చేసిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సోదరుడు, ఇంకో స్నేహితుడితో కలిసి తన భర్తను హత్య చేసినట్లు విచారణలో ఆమె వెల్లడించింది. ఈమె కాంగ్రెస్‌ సీనియర్ నేత, సర్దూల్‌గఢ్ మాజీ ఎమ్మెల్యే అజిత్ ఇందర్ సింగ్ మోఫార్‌కు స్వయానా మేనకోడలు. ఈ ఘటనతో రాజకీయంగానూ తీవ్ర దుమారం రేగింది. హతుడు నివాసం నుంచి తుపాకీ స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ అలమ్ విజయ్ సింగ్ తెలిపారు. నిందితురాలితోపాటు ఆమె తల్లి, సోదరుడిపై కూడా కేసు నమోదు చేశామని ఆయన తెలియజేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.