యాప్నగరం

70 ఏళ్ల తల్లిని క్రూరంగా కొట్టిన కొడుకు

తల్లి దేవుడితో సమానం అంటారు. నవమాసాలు మోసి కన్న బిడ్డను పెద్దయ్యే వరకు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది.

TNN 10 Dec 2016, 6:58 pm
తల్లి దేవుడితో సమానం అంటారు. నవమాసాలు మోసి కన్న బిడ్డను పెద్దయ్యే వరకు కడుపులో పెట్టుకుని కాపాడుకుంటుంది. బిడ్డే తన సర్వస్వంగా భావిస్తుంది. అలాంటి తల్లిని ఓ మూర్ఖుడు అతి క్రూరంగా కొట్టాడు. 70 ఏళ్ల వృద్ధాప్యంలో ఉన్న తల్లిని కంటికి పాపలా కాపాడాల్సింది పోయి రక్తం కారాలే చితకబాదాడు. ఈ హృదయ విదాకర ఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకుంది.
Samayam Telugu 70 year old delhi woman allegedly beaten brutally by her son
70 ఏళ్ల తల్లిని క్రూరంగా కొట్టిన కొడుకు


ఈ మేరకు ఢిల్లీలోని షాదర ప్రాంతానికి చెందిన నంద కిషోర్.. 70 ఏళ్ల తన తల్లి రాజీందరి దేవీని అతి క్రూరంగా కొట్టినట్లు మానవ హక్కుల కార్యకర్త కుందన్ శ్రీవాత్సవ ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసారు. ఈ సంఘటన నవంబర్ 24న జరిగిందని ఆయన వెల్లడించారు. అయితే నంద కిషోర్‌ను అరెస్టు చేసిన పోలీసులు అతన్ని తీహార్ జైలుకు పంపిచారని కూడా ఆయన తెలిపారు. ఆ తల్లిని కొట్టినప్పటి వీడియోలు, ఫొటోలను కూడా శ్రీవాత్సవ షేర్ చేసారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.