యాప్నగరం

భార్య అమెరికాలో.. భర్త నిర్జీవంగా ఫ్లాట్‌లో!

భార్య అమెరికాలోని కూతుళ్ల దగ్గరకు వెళ్లింది. 75 ఏళ్ల వయసులో ఆయనొక్కడే ఫ్లాట్‌లో ఉన్నాడు. కానీ..

TNN 6 Oct 2017, 5:19 pm
‘మా అమ్మాయి ఇంజనీరింగ్ చదివిందండీ.. అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తోంది’ అని చెప్పుకోవాలని ప్రతి తండ్రీ ఆరాటపడతాడు. కొడుకో కూతురో విదేశాల్లో ఉద్యోగం చేస్తుంటే గొప్పగా ఫీలవుతారు. వారికి ఏదైనా అవసరం ఉంటే.. వృద్ధాప్యంలో ఉన్నా రెక్కలు కట్టుకొని వాలిపోతుంటారు. కానీ బిడ్డల అమెరికా కొలువు కారణంగా ఇక్కడ తల్లిదండ్రులు దిక్కులేని వారిగా మారితే? హైదరాబాద్‌కు చెందిన 75 ఏళ్ల లక్ష్మీ నారాయణ విషయంలో ఇలాగే జరిగింది. ఆయన భార్య అమెరికాలోని కూతుళ్ల దగ్గరకు వెళ్లింది. ఆమె ఇండియా తిరిగొచ్చి ఇంటి తలుపులు తెరిచే సరికి.. కుళ్లిపోయిన స్థితిలో అతడి భర్త మృతదేహం కనిపించింది. వివరాల్లోకి వెళితే..
Samayam Telugu 75 year old man lies dead in flat for 40 days while wife daughters are away in us
భార్య అమెరికాలో.. భర్త నిర్జీవంగా ఫ్లాట్‌లో!


75 ఏళ్ల లక్ష్మీ నారాయణ ఎల్బీ నగర్‌లోని మారుతి రెసిడెన్సీలోని కూతురి ఫ్లాట్‌లో నివాసం ఉంటున్నాడు. ఆయన భార్య అమెరికాలోని కూతుళ్ల దగ్గరకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న లక్ష్మీనారాయణ ఓరోజు బాత్రూం నుంచి బయటకు వస్తూ జారి పడ్డాడు. దీంతో తల గోడకు బలంగా తగిలింది. సాయం కోసం అరిచినా.. ఇంట్లో లోపల ఉండిపోవడంతో ఆయన ఆర్తనాదాలు ఎవరికీ వినిపించలేదు. దీంతో ఆ వృద్ధుడు అక్కడే ప్రాణాలు విడిచాడు. రాజమండ్రికి చెందిన ఆయన ఈ మధ్యే హైదరాబాద్ వచ్చారు. సెంట్రల్ లాకింగ్ సిస్టమ్ కావడంతో అపార్ట్‌మెంట్లో ఉండేవాళ్లు కూడా ఇంట్లో ఎవరూ లేరనుకున్నారు. బయటి నుంచి తాళం వేశారని, ఇంట్లో వాళ్లంతా అమెరికాలో ఉంటున్నారని వాళ్లు భావించారు.

ఆయనకు ఎన్నోసార్లు ఫోన్ చేశామని, కానీ లిఫ్ట్ చేయలేదని లక్ష్మీ నారాయణ భార్య తెలిపింది. ఎవరి మీదైనా కోపం వస్తే ఆయన ఫోన్ ఎత్తరని, అందుకే తమకు ఎలాంటి అనుమానం రాలేదని ఆమె చెప్పారు. మృతదేహాన్ని జాగ్రత్తగా గమనించిన పోలీసులు.. ఆయన కాలి కింద బల్లి చనిపోయి ఉండటాన్ని గమనించారు. దీన్ని బట్టి బల్లి మీద కాలేసి జారిపడి మరణించి ఉంటాడని భావిస్తున్నారు. ఆయన మరణం గురించి తమకు ఎలాంటి అనుమానాలు లేవని కుటుంబ సభ్యులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.